‘బీజేపీతో కలిసే ప్రసక్తేలేదు’

First Published Jun 2, 2018, 3:26 PM IST
Highlights

వంచనపై గర్జనలో అంబటి రాయుడు

గత కొంతకాలంగా తమ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటోందనే ప్రచారం జరుగుతోందని.. అది ముమ్మాటికి అబద్ధమని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు.  చంద్రబాబు చేపడుతున్న నవ నిర్మాణ దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ ఈ రోజు ‘వంచన పై గర్జన’  పేరిట దీక్షా కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ దీక్షలో పాల్గొన్న అంబటి రాయుడు  పలు విషయాల గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబును మోసం చేయలేదని.. ఈ ఇద్దరు నేతలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ఈ విషయంలో ఎందుకు వెనుకాడుతోందని అంబటి ప్రశ్నించారు. 

టీడీపీ-బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీతో వైఎస్సార్‌సీపీ కలిసే ప్రసక్తే లేదని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు కావాలనే వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

అనంతరం ఎంపీ మేకపాటి  మాట్లాడుతూ...చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉండటం మన ఖర్మ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు తెలుగుజాతికి చేసిన ద్రోహాన్ని అంత తేలికగా మర్చిపోలేమన్నారు. 

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు సొంతమని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదని, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిన అక్రమకేసుల్లో ఇరికించేందుకని పేర్కొన్నారు. 

చంద్రబాబు ఏపీకి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి, ప్రత్యేక హోదా సాధన జననేత వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమని ఎంపీ మేకపాటి వివరించారు.

click me!