‘పవన్.. స్క్రిప్టు చదవడం కాదు.. వాస్తవాలు తెలుసుకో’

First Published Jun 2, 2018, 3:04 PM IST
Highlights

ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు

‘పవన్.. ఎవరో రాసిన స్క్రిప్టు చదవడం కాదు.. వాస్తవాలు తెలుసుకోవాలి’ అని ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర లక్ష్యం ఏంటో తెలియడం లేదన్నారు. 

అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం సీఎం పోరాడుతున్నారని, 29 సార్లు ఢిల్లీ వెళ్లి అందరినీ కలిశారని గుర్తుచేశారు. కాగా ఏపీ విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. నాలుగేళ్లలో హోదా కోసం పవన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని విమర్శించకుండా సీఎం చంద్రబాబునే విమర్శిస్తున్నారని అన్నారు. జిల్లాలో మైనింగ్, ఇసుక మాఫియా లేదని స్పష్టం చేశారు. పవన్.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని.. అలాకాకుండా వాస్తవాలు గ్రహిస్తే బాగుంటుందని హితవు పలికారు.

టీడీపీ హయాంలోనే జిల్లాలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. నిరుద్యోగుల పాలిట వరం నిరుద్యోగ భృతి అని దాన్ని తప్పుపట్టడం అవివేకమని మండిపడ్డారు. ఆనాడు రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లో అన్న చిరంజీవి తన పార్టీని విలీనం చేస్తే...ఇప్పుడు రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీని విమర్శించకుండా తమ్ముడు పవన్.. సీఎంపై బురదజల్లుతున్నారని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు దుయ్యబట్టారు.

click me!