మేడాకు సహకరించను, నాకు టికెట్ ఇవ్వండి..వైసీపీ నేత

Published : Jan 29, 2019, 03:28 PM IST
మేడాకు సహకరించను, నాకు టికెట్ ఇవ్వండి..వైసీపీ నేత

సారాంశం

తనకు ఎలాంటి పెద్ద పెద్ద పదవులు ఏమీ వద్దని కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇస్తేచాలు అని అడుగుతున్నారు వైసీపీ నేత ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి


తనకు ఎలాంటి పెద్ద పెద్ద పదవులు ఏమీ వద్దని కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇస్తేచాలు అని అడుగుతున్నారు వైసీపీ నేత ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి. కడప జిల్లాకు చెందిన ఈయన వచ్చే ఏపీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టకాలంలో పార్టీ కి అండగా ఉంటూ... కార్యకర్తలకు అండగా ఉన్నానన్నారు. కొత్తగా పార్టీలోకి చేరుతున్న మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్ ఇస్తే సహకరించమని చెప్పారు. 

అనంతరం ఆయన అనుచరులు మాట్లాడుతూ.. ఆకేపాటి అమర్ నాత్ రెడ్డికి అన్యాయం జరుగుతుందంటే.. తాము అంగీకరించమన్నారు. జగన్.. కచ్చితంగా ఆకేపాటికి టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నామన్నారు. అలా కాదని వేరేవారికి టికెట్ ఇస్తే.. చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్