విశాఖకు రైల్వేజోన్ త్వరలోనే: వెంకయ్యతో భేటీ తర్వాత కొణతాల

By narsimha lodeFirst Published Jan 29, 2019, 3:20 PM IST
Highlights

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖకు రైల్వే జోన్  వస్తోందనే ఆశాభావాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వ్యక్తం చేశారు.ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయాలని కోరుతూ జనఘోష పేరుతో  కొణతాల రామకృష్ణ నేతృత్వంలో బృందం న్యూఢిల్లీకి చేరుకొంది.

న్యూఢిల్లీ: ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖకు రైల్వే జోన్  వస్తోందనే ఆశాభావాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వ్యక్తం చేశారు.ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయాలని కోరుతూ జనఘోష పేరుతో  కొణతాల రామకృష్ణ నేతృత్వంలో బృందం న్యూఢిల్లీకి చేరుకొంది.

మంగళవారం నాడు  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో  బృందం సభ్యులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు.ఏపీ రాష్ట్రానికి  ఇచ్చిన విభజన హామీలు అమలు కాని విషయాన్ని ఈ బృందం సభ్యులు ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. 

ఈ దఫా విశాఖ రైల్వేజోన్‌ వచ్చే అవకాశం ఉందని  వెంకయ్య  హామీ ఇచ్చారని  కొణతాల చెప్పారు. ఏపీ రాష్ట్రానికి తన శక్తివంచన లేకుండా సహాయాన్ని అందిస్తానని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చారని కొణతాల చెప్పారు.
 

click me!