టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదరం : బొత్స సత్యనారాయణ

By Nagaraju TFirst Published Jan 29, 2019, 3:20 PM IST
Highlights

మరోవైపు రాష్ట్రంలో ఎవరైనా సర్వేలు చేసుకోవచ్చు అన్న డిఐజీ పాలరాజు వ్యాఖ్యలను బొత్స ఖండించారు. సర్వేలు ఎవరైనా చేసుకోవచ్చు కానీ సర్వేల పేర్లతో ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డులు తీసుకుంటున్న వారిని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. చట్టం అందరికి చట్టమేనని కానీకొందరికి చుట్టం కాకూడదన్నదే తన అభిమతమన్నారు. 

విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ దోపిడీ పార్టీగా మారిందని ఘాటుగా విమర్శించారు. విజయనగరం జిల్లాలో మీడియాతో మాట్లాడిన బొత్స సర్వేల పేర్లతో వైసీపీ సానుభూతి ఓట్లను తొలగించే కుట్రను అడ్డుకుంటే ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. 

అధికార తెలుగుదేశం పార్టీ  రెవిన్యూ, పోలీస్ వారి అండదండలతో సర్వేల పేరుతో ఇంటింటికి తిరిగి  వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే తమ నాయకులపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదని హెచ్చరించారు.

మరోవైపు రాష్ట్రంలో ఎవరైనా సర్వేలు చేసుకోవచ్చు అన్న డిఐజీ పాలరాజు వ్యాఖ్యలను బొత్స ఖండించారు. సర్వేలు ఎవరైనా చేసుకోవచ్చు కానీ సర్వేల పేర్లతో ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డులు తీసుకుంటున్న వారిని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. చట్టం అందరికి చట్టమేనని కానీకొందరికి చుట్టం కాకూడదన్నదే తన అభిమతమన్నారు. 

రాజ్యంగ వ్యవస్థలను కాపాడుకోవలిసిన బాధ్యత అధికారులపై కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయని బొత్స విమర్శించారు. కార్యకర్త నుండి సీఎం వరకు  దోచుకునే విధంగా పథకాలు రూపోందిస్తున్నారని ధ్వజమెత్తారు. 

డీపీఆర్ ,ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా శంకుస్థాపనలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. సర్వేల రూపంలో ఇంటికి వచ్చి ఆధార్ కార్డ్ లు అడిగితే సహకరించాలే తప్ప ఏ పార్టీకి ఓటేస్తారు వంటి ప్రశ్నలు అడిగితే మాత్రం ఎలాంటి సమాధానం చెప్పొద్దన్నారు. 

వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాలలో ఓట్ల తొలగింపు జరుపుతున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కొందరు బీసీ కులాలను షెడ్యూల్డ్ కులాల్లో చేరుస్తామని  మాయమాటలు చెప్తున్నారని వాటిని నమ్మెద్దన్నారు. చంద్రబాబు మహిళలకు పోస్ట్ డేటేడ్ చెక్కులు ఇస్తామనడం దారుణమన్నారు. 

పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడం దేశంలోనే ఇదే మెుట్టమెుదటిది కావొచ్చేమోనన్నారు. అగ్రకులాల్లో వెనుక బడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం చెప్తుంటే అందులో 5శాతం రిజర్వేషన్లు కాపులకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం మోసమేనని బొత్స వ్యాఖ్యానించారు. 

click me!