వైసీపీ కీలక నేత ఇంట్లో విషాదం

Published : May 11, 2019, 12:00 PM IST
వైసీపీ కీలక నేత ఇంట్లో విషాదం

సారాంశం

ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  ఇంట విషాదం చోటుచేసుకుంది. శివప్రసాద్ రెడ్డి  తండ్రి, మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి మృతి చెందారు.

ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  ఇంట విషాదం చోటుచేసుకుంది. శివప్రసాద్ రెడ్డి  తండ్రి, మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో అభిమానులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సుబ్బారెడ్డి మరణించినట్లు సమాచారం అందుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, వైసీపీ నేతలు సంతాపం తెలిపి.. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామంలో బూచేపల్లి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. అంతిమ సంస్కారాలకు జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.

సుబ్బారెడ్డి 2004లో దర్శి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. అయితే అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన బూచేపల్లి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2009లో బూచేపల్లి కుమారుడు శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2014లో వైసీపీ నుంచి పోటీచేసిన శివప్రసాద్ రెడ్డి ఓటమి చెందారు. సుమారు పదేళ్లుగా పైగా రాజకీయాల్లో ఉన్న శివప్రసాద్ రెడ్డి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు
 

PREV
click me!

Recommended Stories

Cold Waves : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu