బ్రేకింగ్: ప్రత్యేకహోదా కోసం వైసిపి పోరు

First Published Feb 12, 2018, 8:40 PM IST
Highlights
  • జంతర్ మంతర్ వద్ద ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు ముఖ్య నేతలందరూ భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం వైసిపి 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు భారీ ప్లాన్ చేసింది. అదే రోజు బడ్జెట్ సమావేశాల రెండో విడత సమావేశాలు మొదలయ్యే రోజున్న విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా అదేరోజు జంతర్ మంతర్ వద్ద ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు ముఖ్య నేతలందరూ భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్యక్షతన సోమవారం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పెద్ద కొండూరులో పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం జరిగింది.

బడ్జెట్ లో ఏపికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూనే ప్రత్యేకహోదాను సాధించేందుకు అవలంభించాల్సిన మార్గాన్ని నిర్ణయించేందుకు సమావేశం జరిగింది. మార్చి 1వ తేదీన రాష్ట్రంలోని అన్నీ కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు. అదే విధంగా 3వ తేదీన అందరూ ఢిల్లీకి బయలుదేరి 5వ తేదీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. అదే విధంగా పార్లమెంటులో కూడా ప్రత్యేకహోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేయాలని సమావేశం నిర్ణయించింది.

click me!