కేంద్రమంత్రి సుజనా పై ఫిర్యాదు

Published : Jan 27, 2017, 10:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కేంద్రమంత్రి సుజనా పై ఫిర్యాదు

సారాంశం

ఉద్యమం చేస్తున్న యువతను నోటికి వచ్చినట్లు మంత్రి మాట్లాడుతున్నారంటేనే అధికార మత్తు ఏ స్ధాయిలో తలకెక్కికిందో అర్ధమవుతోంది.

కేంద్రమంత్రి సుజనాచౌదరిపై వైసీపీ నేత ఫిర్యాదు చేసారు. ప్రత్యేకహోదా ఉద్యమంపై మంత్రి మాట్లాడుతూ, జల్లికట్టు స్పూర్తితో ఉద్యమం చేయటం తగదన్నారు. అంతటితో ఆగకుండా జల్లికట్టును స్పూర్తిగా తీసుకుంటే, జల్లికట్టే ఆడుకోవాలన్నారు. తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ, ఉద్యమం చేస్తున్న వారు కోళ్ల పందేలో లేక పందుల పందేలో ఆడుకోవాలి గానీ ప్రత్యేకహోదా ఉద్యమం చేయటమేమిటంటూ చాలా చుకలకనగా మాట్లాడారు.  ఓట్లేసే వారితో సుజనాకు ఎటువంటి అవసరం లేదు. ఎందుకంటే, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా లేదుకాబట్టే రాజ్యసభ ద్వారా పార్లమెంట్ కు ఎన్నికయ్యారు సుజనా.కాబట్టే యువతను అంత చులకనగా మాట్లాడారు.

 

ఉద్యమం చేస్తున్న యువతను నోటికి వచ్చినట్లు మంత్రి మాట్లాడుతున్నారంటేనే అధికార మత్తు ఏ స్ధాయిలో తలకెక్కికిందో అర్ధమవుతోంది. మంత్రి మాటలు విన్న నెటిజన్లు మండి పడుతున్నారనుకోండి అది వేరే సంగతి. అంతేకాకుండా నందికి పందికి తేడాతెలీదంటూ వెంకయ్యనాయడు, చంద్రబాబునాయుడు, సుజనాచౌదరి ఫొటోలతో కూడిన వ్యాఖ్యలు కూడా నెటిజన్లు సర్కులేట్ చేస్తున్నారులేండి. మంత్రి చేసిన వ్యాఖ్యలకు సుజనాచౌదరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నేత జోగి రమేష్ ఇబ్రహింపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అయితే, జోగి ఫిర్యాదును షరామామూలుగానే పోలుసులు లైట్ తీసుకున్నానుకోండి.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu