ఈ ప్రశ్నలు చంద్రబాబును అడగొద్దు

Published : Jan 27, 2017, 09:51 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఈ ప్రశ్నలు చంద్రబాబును అడగొద్దు

సారాంశం

అడిగే ముందు రాజకీయాలలో   మీ అనుభవం ఎంతో తెలుసుకోండి. గతంలో ముఖ్యమంత్రి గా పనిచేశారో లేదో చూసుకోండి

 

ముఖ్యమంత్రి చంద్రబాబు  ఎదురుప డినా, ఏదైన సమావేశంలో, వీడియో కాన్షరెన్స్ లో ఉన్నా  ఆయన  మాట్లాడటమే ఉంటుంది. గంటల తరబడి మాట్లాడగలరు. అలాంటపుడు చప్పట్లకే తప్ప ప్రశ్నలకు తావుండదు. ఒక వేళ అవకాశమొస్తే, ఏ ప్రశ్న అయినా అడగండి గాని, ఈ కింది 28 ప్రశ్నలు మాత్రం అడగవద్దు.

 

*ప్రత్యేక హోదా  ఏమయిందని అడగొద్దు

*ప్రత్యేక హోదా ఎందుకు వదలుకున్నావని అడగొద్దు

 

*వైజాగుకి హుధుద్ తరువాత ఇచ్చిన వెయ్యి కోట్లు ఏవని అడగొద్దు

*వైజాగుకి ఇస్తామన్న రైల్వే జోన్ ఏది అని అడగొద్దు

 

*వైజాగ్లో 2016 లో MOU చేసుకున్న నాలుగు లక్షల కోట్లు ఏవి అని అడగొద్దు

*కేంద్రం నుంచి మొదటి సంవత్సరం లోటుభర్తీ నిధి వచ్చిందా అని అడగొద్దు

 

*స్పెషల్ ప్యాకేజీతో రాని ఇండస్ట్రీస్ స్పెషల్ స్టేటస్ తో  వస్తాయని తెలిసినా అడగొద్దు

*పార్లమెంట్ లో ప్రధాని మాటకు లేని చట్ట బద్ధత ప్రెస్ మీట్ లో కాబినెట్ మినిస్టర్ మాటకు ఉంటుందా అని అడగొద్దు

 

*పన్ను రాయితీలు బామ్మర్దుల సినిమాకి మాత్రమే ఇచ్చిన విషయం అడగొద్దు

*పద్మ పురస్కారాలు ‘మన’ వాళ్ళకే ఎందుకు అని అడగొద్దు

 

*పదవులు, ప్రసాదాలు మీ వాళ్ళకే ఎందుకు అని అడగొద్దు

*బీసీలకి పది వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఏది అని అడగొద్దు

 

*కాపుల రిజర్వేషన్స్ ఏవి అని అడగొద్దు

*రజకులని SC లలోచేర్చారా అని అడగొద్దు

 

*పద్మశాలీలని BC -A గా మార్చారా అని అడగొద్దు

*బాబొచ్చాడు జాబ్ ఏది అని అడగొద్దు

 

*నిరుద్యోగులు రెండు వేల భృతి ఏది అని అడగొద్దు

*అన్న కాంటీన్లు ఏవి అని ఆడోగొద్దు 


*సుజల స్రవంతి కింద మంచి నీళ్లు అడగొద్దు

*నోటుకు వోటు లో కెసిఆర్ కి బుక్ అయ్యిందెవరని అడగొద్దు

 

*పుష్కరాల తొక్కిసలాటకి కారణమెవరనిఅడగొద్దు

*చింతమనేని లేడీ ఎమ్మార్వో ని కొట్టినా అడగొద్దు

 

*కాల్ మనీ బాధితులకి న్యాయం జరిగిందా అని అడగొద్దు

*అగ్రి గోల్డ్ బాధితులకి న్యాయం జరుగుతుందా అని అడగొద్దు

 

*రుణమాఫీ మొత్తం చేశావా అని అడగొద్దు

*ఇంటికో ఉద్యోగం ఇచ్చావా అని అడగొద్దు

 

*పక్క పార్టీల ఎమ్మెల్యేలని మీ పక్కలోకి ఎందుకు లాక్కుంటున్నారో అడగొద్దు

*ఉద్యోగులు వెలగ పూడి వెళ్ళాలి కానీ మీ కుటుంబం హైదరాబాదు వదల్లేదేందుకని అడగొద్దు

 

 

(కొంత మంది సోషల్ మీడియా విజ్ఞులు వీటిని సమకూర్చారు)

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu