ap mlc elections: నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు.. ఎవరెవరంటే..?

By Siva KodatiFirst Published Nov 22, 2021, 4:51 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబరు 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు (నవంబరు 23) నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో, వైసీపీ అభ్యర్థులు పలువురు నేడు నామినేషన్లు దాఖలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబరు 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు (నవంబరు 23) నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో, వైసీపీ అభ్యర్థులు పలువురు నేడు నామినేషన్లు దాఖలు చేశారు. కృష్ణా జిల్లాలో తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్‌లు భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ తరఫున తూమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే కరణం బలరాం తదితరులు ఉన్నారు.

ALso Read:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు: స్థానిక సంస్థల కోటాలో వైసీపీ అభ్యర్ధులు వీరే.. మర్రి రాజశేఖర్‌కు మళ్లీ మొండిచేయి

కాగా.. స్థానిక సంస్థల కోటా (local bodies quota ) ఎమ్మెల్సీ ఎన్నికల (ap mlc elections) సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) తన అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించామని.. మరో 7 స్థానాలు ఓసీలకు కేటాయించామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 

వైసీపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే:

ఇందుకూరు రాజు (విజయనగరం) 
వరుదు కళ్యాణి (విశాఖ)
వంశీ కృష్ణయాదవ్ (విశాఖ)
అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి)
మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా)
తలశిల రఘురామ్ (కృష్ణా)
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)
మురుగుడు హనుమంతరావు (గుంటూరు)
తూమాటి మాధవరావు (ప్రకాశం)
కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు)
వై శివరామిరెడ్డి (అనంతపురం)

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 10 ముగ్గురు అభ్యర్ధులను వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం జిల్లా), ఇషాక్ బాషా (కర్నూలు జిల్లా), డీసీ గోవింద రెడ్డి (కడప జిల్లా)లను అభ్యర్ధులుగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. 

click me!