కారణమిదీ: మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ వెనుక

By narsimha lode  |  First Published Nov 22, 2021, 4:31 PM IST

మూడు రాజధానులపై తీసుకొచ్చిన చట్టాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకొంది. అయితే ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొందా అనే చర్చ సాగుతుంది. 



అమరావతి: మూడు రాజధానుల చట్టంపై   న్యాయ పరమైన చిక్కులు ఎదురు కాకండా ఉండేందదుకు గాను ఈ చట్టాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకొందనే అభిప్రాయాలను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల చట్టాన్ని నిరసిస్తూ  ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం రోజువారీ విచారణను నిర్వహిస్తుంది.
 గత వారంలో ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ap high court ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ రాష్ట్ర రాజధానిపై తాము విచారణ చేయడం లేదని తెలిపింది. మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చిన విధానంపైనే తాము విచారణ చేస్తున్నామని ఏపీ హైకోర్టు  ధర్మాసనం తెలిపింది. 

also read:అసెంబ్లీ ముందుకు మళ్లీ రాజధానుల బిల్లు.. ఈ సారి మరింత సమగ్రంగా: జగన్

Latest Videos

undefined

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏర్పాటు చేసిన చట్టంలో రాజధాని అంశం ఒక్కటే ఉందని అమరావతి రైతుల తరపు న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే three capitals  చట్టం  న్యాయ పరంగా చిక్కులకు లోనైతే ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందిగా మారనుంది. మూడు రాజధానులను ycp మినహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. bjp కూడా ఈ విషయమై amaravati రైతుల పాదయాత్రకు మద్దతుగా నిలిచింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో  జగన్ సర్కార్ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొంది.

 మూడు రాజధానుల చట్టానికి హైకోర్టులో చుక్కెదురైతే రాజకీయంగా జగన్ సర్కార్ పై విపక్షాలు మూకుమ్మడిగా ఎదురు దాడికి దిగే అవకాశం ఉంది.   దీంతో ఈ చట్టానికి న్యాయ పరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఏపీ సర్కార్ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొంది.

మూడు రాజధానుల బిల్లుపై  అందరి అభిప్రాయాలను  తీసుకొనేందుకు కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వికేంద్రీకరణపై అధ్యయనం కోసం ఈ కమిటీ పనిచేయనుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కమిటీలో ఉంటారు. విస్తృత సంప్రదింపులు చేయనుంది కమిటీ.  అమరావతి రైతుల నుండి  కూడా అభిప్రాయాలను సేకరించే అవకాశం ఉంది.

 అసెంబ్లీలో కొత్తగా  ప్రవేశపెట్టే బిల్లులో కూడా అన్ని రకాల ప్రశ్నలకు కూడా సమాధానాలను కూడా పొందు పరుస్తామని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గతంలో రూపొందించిన మూడు రాజధానుల చట్టంలోని లోపాలను సవరించి కొత్త బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకు రానున్నారు. 

అసెంబ్లీలో, శాసనమండలిలో వైసీపీకి బలం ఉంది. గతంలో శాసనమండలిలో  టీడీపీకి బలం ఉంది. కానీ డిసెంబర్ 10 తర్వాత ఏపీ శాసన మండలిలో వైసీపీ బలం పెరగనుంది. దీంతో ఈ బిల్లు సులభంగా ఉభయ సభల్లో పాస్ కానుంది.  అయితే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని tdpనిర్ణయం తీసుకొంది.  టీడీపీ సభ్యులు సభకు వచ్చినా వైసీపీదే పైచేయి కానుంది. ఇవాళ మూడు రాజధానుల చట్టానికి సంబంధించి ఎదురయ్యే న్యాయ పరమైన చిక్కులను ప్లానింగ్ శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ కేబినెట్ ముందుంచారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం చేయకుండా కొత్త బిల్లును ప్రవేశపెట్టనుంది జగన్ సర్కార్.
 

click me!