AP Three Capitals Bill : ఎవరికీ భయపడి వెనక్కి తీసుకోలేదు .. దానికి ఇవే కారణాలు: బొత్స

Siva Kodati |  
Published : Nov 22, 2021, 04:02 PM IST
AP Three Capitals Bill : ఎవరికీ భయపడి వెనక్కి తీసుకోలేదు .. దానికి ఇవే కారణాలు: బొత్స

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును (AP Three Capitals Bill) తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో సీఎం జగన్ (ys jagan mohan reddy)  ప్రకటన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు


ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును (AP Three Capitals Bill) తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో సీఎం జగన్ (ys jagan mohan reddy)  ప్రకటన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) మీడియాతో మాట్లాడుతూ.. వికేంద్రకరణ బిల్లులో కొన్ని తప్పులు వున్నాయన్నారు. టీడీపీ (tdp) దీనిపై దుష్ప్రచారం చేసిందని బొత్స ఆరోపించారు. దీనితో పాటు బిల్లులో కొన్ని న్యాయపరమైన చిక్కులు వున్నాయని .. వీటిని పరిగణనలోనికి తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రజలకు సమగ్రంగా ప్రయోజనాలు అందించేందుకు గాను త్వరలోనే ఎలాంటి చిక్కులు లేకుండా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని మంత్రి పేర్కొన్నారు.

13 జిల్లాలు, మూడు ప్రాంతాలు, నియోజకవర్గాల వారీగా అభివృద్ధిని దృష్టిలో వుంచుకుని బిల్లును తీసుకొస్తామని బొత్స చెప్పారు. అంతేతప్పించి నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లే ఉద్దేశ్యం లేదని సత్యనారాయణ స్పష్టం చేశారు. చిత్తశుద్ధితోనే గతంలో నిర్ణయం తీసుకున్నామని.. ఒక్క పర్సంట్ కూడా అసంతృప్తి, అపోహాలు లేకుండా ఇంకా పకడ్బందీగా బిల్లును తీసుకొస్తామని బొత్స చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని.. దీనిపై నిపుణులతో కమిటీ వేశామని.. వారి సిఫారసుల మేరకే ముందుకు వెళ్లామన్నారు. అవసరమైతే మరో కమిటీ వేసి సమగ్రంగా బిల్లు రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తాము ఎవరికి భయపడి వెనక్కి తగ్గలేదని బొత్స తెలిపారు. 

ALso Read:అసెంబ్లీ ముందుకు మళ్లీ రాజధానుల బిల్లు.. ఈ సారి మరింత సమగ్రంగా: జగన్

అంతకుముందు మెరుగైన బిల్లు అతి త్వరలో అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్ధితుల్లో మూడు రాజధానుల (Three Capital Bill) నిర్ణయం వచ్చిందో అందరికీ తెలుసునని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan mohan reddy). మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకోవడంపై అసెంబ్లీలో (ap assembly) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు వుండేదని , ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు వుండేదని జగన్ గుర్తుచేశారు. 

తర్వాత 1956లో కర్నూలు నుంచి రాజధాని, గుంటూరు నుంచి హైకోర్టు హైదరాబాద్‌కు తీసుకెళ్లారని ఆయన అన్నారు. ఆ సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీబాగ్ ఒడంబడిక (sribagh agreement) చేసి .. రాయలసీమకు న్యాయం చేస్తామని చెప్పారని సీఎం తెలిపారు. అనంతర పరిణామాలతో అమరావతిలో రాజధాని పెట్టడానికి దారి తీసిన పరిణామాలను జగన్ గుర్తుచేశారు. శ్రీకృష్ణ కమిటీ నిబంధనలను విరుద్ధంగా రాజధాని నిర్ణయం జరిగిందని.. కానీ 50 వేల ఎకరాల్లో చంద్రబాబు రాజధాని పెట్టాలని నిర్ణయించారని సీఎం అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్