రాజ్యసభ: 7న వైసిపి అభ్యర్ధి నామినేషన్

First Published Mar 3, 2018, 10:46 AM IST
Highlights
  • తమ పార్టీ తరపున నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్ధిగా పోటీ చేస్తారని జగన్ తరపున రాజ్యసభ విజయసాయిరెడ్డి ప్రకటించి సంగతి తిలిసిందే.

రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 7వ తేదీన వైసిపి అభ్యర్ధి నామినేషన్ వేస్తున్నారు. వచ్చే నెలలో రాష్ట్రంలోని మూడు స్ధానాలు ఖాళీ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికోసం టిడిపి, వైసిపిలు పోటీ పడుతున్నాయ్. ప్రస్తుత ఎంఎల్ఏల బాలాల అధారంగా టిడిపికి రెండు స్దానాలు, వైసిపికి ఒకస్ధానం దక్కుతాయి. తమ పార్టీ తరపున నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్ధిగా పోటీ చేస్తారని జగన్ తరపున రాజ్యసభ విజయసాయిరెడ్డి ప్రకటించి సంగతి తిలిసిందే.

ఎంఎల్ఏల సంఖ్య ఆధారంగా ప్రతీ రాజ్యసభ స్ధానానికి 44 మంది ఎంఎల్ఏలు ఓట్లు వేయాలి. ఈ లెక్కన 104 మంది ఎంఎల్ఏలున్న టిడిపి 2 స్ధానాలు సునాయాశంగా గెలుచుకుంటుంది. సమస్యంతా వైసిపిదే. ఎందుకంటే, వైసిపికి సరిగ్గా 44 మంది ఎంఎల్ఏల బలం మాత్రమే ఉంది.

పోయిన ఎన్నికల్లో 67 మంది గెలిచినప్పటికీ 23 మందిని చంద్రబాబునాయుడు ఫిరాయింపులతో ప్రోత్సహించి టిడిపిలోకి లాక్కున్నారు. దాంతో వైసిపి బలం ప్రస్తుతం 44కి పడిపోయింది. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా దెబ్బ కొట్టే ఉద్దేశ్యంతో ఇంకో ఇద్దరిని లాక్కోవాలని టిడిపి చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే జగన్ కు పెద్ద దెబ్బఖాయం. అందుకే తన ఎంఎల్ఏలను కాపాడుకునేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. నామినేషన్ సమయంలోనే ఎంఎల్ఏలతో క్యాంపు రన్ చేయాలని జగన్ నిర్ణయించారు. దాంతో రాజ్యసభ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరలేస్తోంది.

 

click me!