ముందు తీర్పు... తర్వాతే వాదనలు

First Published Dec 22, 2016, 12:51 PM IST
Highlights

తన వాదన వినకుండానే, విచారణ జరగకుండానే తాను తప్పు చేసినట్లు కమిటి ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు.

ముందు తీర్పు తర్వాతే విచారణ అన్నట్లుంది ఏపి ప్రివిలేజ్ కమిటి వ్యవహారం. పోయిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా డిమాండ్ తో పలువురు వైసీపీ సభ్యులు సభలో కార్యకలాపాలను అడ్డుకున్నారు. అందుకని పలువురిని స్పీకర్ సస్పెండ్ కూడా చేసారు.

 

అయితే, వారిపై తదుపరి చర్యలు తీసుకునే విషయమై స్పీకర్ విషయాన్ని ప్రివిలేజ్ కమిటికి వదిలేసారు.

 

ఇప్పటికే పలుమార్లు కమిటీ సభ్యులను విచారించింది. తాజాగా గురువారం కమిటీ సమావేశమైంది. విచారణకు హాజరవ్వాల్సిందిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నానిలకు కమిటీ నోటీసులు ఇచ్చింది. సరే, ఇద్దరూ విచారణకు వచ్చారు. అయితే, కమిటీ ముందు హాజరైన నాని మాత్రం తాను ఏ తప్పు చేయలేదని వాదించారు.

 

అప్పట్లో రికార్డయిన వీడియోల్లో తాము తప్పు చేసినట్లు ఎక్కడా లేదన్నారు. అంతేకాకుండా ఒకే సామాజిక వర్గంపై చర్య తీసుకున్నట్లుంటుందనే తనపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అవుతోందని ఆరోపించారు.

 

ఇక, చెవిరెడ్డి కూడా విచారణకు హాజరైనా వెంటనే బహిష్కరించారు. కమిటీ హాలు వద్ద వున్న మీడియాతో మాట్లాడుతూ, విచారణ సందర్భంగా తన వాదన వినకుండానే తాను తప్పు చేసినట్లు కమిటీ సభ్యులు చెప్పటంపై అభ్యంతరం వ్యక్తం చేసారు.

 

తన వాదన వినకుండానే, విచారణ జరగకుండానే తాను తప్పు చేసినట్లు కమిటి ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. లోపల ఏమి జరిగిందో ఎవరికీ తెలీదు. బయటకు వచ్చి చెప్పింది చెవిరెడ్డే కాబట్టి అదే నమ్మాలి.  చూడబోతే చెవిరెడ్డి చెప్పింది కూడా నిజమే కదా. ముందుగా తీర్పు ఇచ్చేసి తర్వాత వాదనలు మొదలు పెట్టమన్నట్లుంది కమిటీ వ్యవహారం.

click me!