వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు కేబినెట్ హోదా సైతం కల్పించేశారు సీఎం జగన్. మెుత్తానికి కేబినెట్ హోదాతో కూడిన జోడు పదవులను పట్టేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
అమరావతి: వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటి అన్న సామెత ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విషయంలో నిజమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆయన బంపర్ ఆఫర్ కొట్టేశారు.
ఇటీవలే ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమితులైన ఆయనకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చేశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా నియమిస్తూ మరో జీవో విడుదల చేశారు. దాంతో జగన్ కోటరీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన నేతల్లో యార్లగడ్డ కూడా చేరిపోయారు.
ఇకపోతే ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ పరిణామాల నేపథ్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత యార్లగడ్డను హిందీ అకాడమీ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే.
వైయస్ ఆర్ చనిపోయిన తర్వాత కూడా ఆకుటుంబ సభ్యులతో మంచి సంబంధాలే కొనసాగించారు యార్లగడ్డ. ఈ పరిచయాల నేపథ్యంలో జగన్ సీఎం అయితే యార్లగడ్డకు మంచి భవిష్యత్ ఉంటుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది.
అంతా అనుకున్నట్లుగానే జగన్ బంపర్ మెజారిటీతో సీఎం అయిపోయారు. కనీవినీ ఎరుగని రీతిలో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేశారు.
ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. తెలుగుభాష, వైయస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధంతోపాటు ఇతర అంశాలపై చర్చించారు.
జగన్ ను కలిసిన కొద్దిరోజుల్లోనే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.రాష్ట్రపర్యాటక కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యార్లగడ్డ నియామక ఉత్తర్వులకు సంబంధించి జీవోను విడుదల చేశారు. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు జీవోలో పొందుపరిచారు.
తాజాగా ఆయనను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు కేబినెట్ హోదా సైతం కల్పించేశారు సీఎం జగన్. మెుత్తానికి కేబినెట్ హోదాతో కూడిన జోడు పదవులను పట్టేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
ఇకపోతే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను ఆంధ్రప్రదేశ్ అకాడమీ చైర్మన్ గా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత సైతం వైయస్ రాజశేఖర్ రెడ్డి నియమించారు. ప్రస్తుతం ఆయన తనయుడు సీఎం జగన్ సైతం తండ్రి కట్టబెట్టిన పదవినే యార్లగడ్డకు కట్టబెట్టి తండ్రిచాటు తనయుడు అనిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
నాడు వైయస్ఆర్, నేడు జగన్: ఎన్టీఆర్ సన్నిహితుడికి కీలక పదవి