పవన్ కల్యాణ్ ను ఎలా నమ్ముతారు?

Published : Jun 02, 2018, 07:55 AM IST
పవన్ కల్యాణ్ ను ఎలా నమ్ముతారు?

సారాంశం

తమ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తప్పు పట్టారు.

అమరావతి: తమ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తప్పు పట్టారు. ఏడాదికి రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో నిరుద్యోగ భృతి ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధమయితే పవన్‌కల్యాణ్‌ దీన్ని నమ్మవద్దనడం సరి కాదని అన్నారు. 

ఏ మాత్రం అనుభవం లేని పవన్ కల్యాణ్ మాటలను ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ భృతిపై ఎంతో కసరత్తు చేసి గట్టి విధానం రూపొందించామని చెప్పారు. 

తమను ముఖ్యమంత్రులను చేయండి, తామే అన్నీ చేస్తామనే జగన్‌, పవన్‌కల్యాణ్‌లను ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన అడిగారు. నాలుగేళ్లలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 98శాతం హామీలు అమలు చేశామని, ప్రజల్లో ప్రభుత్వం పట్ల 76శాతం సంతృప్తి ఉందని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu