మైనస్ లోకి గ్రోత్ రేట్... ప్రమాదపు అంచుల్లో ఏపీ: యనమల ఆందోళన

By Arun Kumar PFirst Published May 21, 2021, 2:25 PM IST
Highlights

వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.  

గుంటూరు: వైసిపి ప్రభుత్వం ఈ రెండేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేవలం అంకెల గారడి మాత్రమే వుందని... దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.  కరెంట్ ప్రైసెస్ ప్రకారం మాత్రమే ప్రభుత్వం గ్రోత్ రేట్ చూపిస్తుందని... ఇలా ఏ దేశం, ఏ రాష్ట్రం కూడా చూపించవన్నారు. కాన్ట్సెంట్ ప్రైస్ ప్రకారం మాత్రమే గ్రోత్ రేట్ చూస్తారని... ఆ లెక్కల ప్రకారం ఏపీ గ్రోత్ రేట్ -2.58 శాతం గా ఉందన్నారు. అది -5 శాతం వెళ్లే ప్రమాదం ఉందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో బడ్జెట్ పై యనమల ప్రసంగిస్తూ గ్రోత్ రేట్ డబుల్ డిజిట్ ను వరుసగా 5 ఏళ్లు చూపించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశందేనని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చిన్నా బిన్నం చేసిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందని మండిపడ్డారు. 

''ఈ ఏడాది దాదాపు లక్షా 50వేల కోట్లు అప్పు తెచ్చారు. అప్పులు విపరీతంగా పెరగటం వలన డెడ్ సర్వీస్ కు చేరుకుంటుంది. ఇప్పటి వరకు రూ.4,47,125 కోట్ల అప్పులు చేశారు. రాబోయే రోజుల్లో లక్ష కోట్లు అప్పు తీర్చడానికే అప్పు చేయాల్సి వస్తుంది. తెచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారో అర్ధం కావడం లేదు'' అని అన్నారు. 

read more  తెలంగాణను చూసైనా.. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి.. నారా లోకేష్

''కరోనా సాకుగా చూపించి అప్పులు చేస్తున్నారు. అది జగన్ రెడ్డి చేతగాని ప్రభుత్వానికి నిదర్శనం. ప్రభుత్వం మారేటప్పుడు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉంది దానిని జగన్ రెడ్డి మైనస్ ల్లోకి తీసుకువెళ్లారు.భవిష్యత్ లో ఇంక అభివృద్ధి, సంక్షేమం అంటూ ఏమీ ఉండదు. బడ్జెట్ లో రూ.227 కోట్లు కరోనాను ఎదుర్కొనడానికి కేటాయింపులు చూపించారు. అందులో వ్యాక్సినేషన్ కు కేటాయింపులు లేవు'' అని తెలిపారు. 

''సామాన్యుడి మీద ఆదాయం పడిపోయింది అప్పు భారం పెరిగిపోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వానికి మహా అయితే మిగిలింది కేవలం రెండు బడ్జెట్ లు మాత్రమే. ఒక అంధకారమైన భవిష్యత్ ఉంటుందని జగన్ పరిపాలనతో అర్ధమవుతుంది'' అంటూ యనమల ఆందోళన వ్యక్తం చేశారు. 

click me!