బొనిగె ఆనందయ్య కరోనా మందు సంచలనం: నెల్లూరుకు ఐసిఎంఆర్ బృందం

By telugu team  |  First Published May 21, 2021, 1:56 PM IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగే ఆనందయ్య ఇస్తున్న కరోనా మందు సంచలనం సృష్టిస్తోంది. ఆ మందుపై కేంద్ర విభాగాల అధికారులతో అధ్యయనం చేయించాలని సీఎం జగన్ ఆదేశించారు.


నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నంలో బొనిగి ఆనందయ్య కరోనా ఆయుర్వేదం మందు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష చేశారు. ఆ మందు శాస్త్రియతను నిర్ధారించాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐసిఎంఆర్ బృందం నెల్లూరుకు చేరుకుంటోంది.

కేంద్ర విభాగాల అధికారులతో దానిపై అధ్యయనం చేయించాలని ఆయన సూచించారు. దీంతో ఐసిఎంఆర్ మందుపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేస్తోంది. కరోనా మందు కోసం కృష్ణపట్నానికి వేలాది మంది చేరుకుంటున్నారు. ఈ క్రమంలో తోపులాట కూడా చోటు చేసుకుంది. దాంతో కొద్ది సేపు ఆనందయ్య మందు ఇవ్వడాన్ని ఆపేశారు.

Latest Videos

undefined

Also Read: ఆనందయ్య కరోనా మందు... సీఎం జగన్ కీలక సమావేశం (వీడియో)

ఇదిలావుంటే, కరోనా వైరస్ కు నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేదం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ మందుపై అంతటా చర్చ సాగుతోంది. వేలాది మందిగా ప్రజలు ఆయన మందు కోసం బారులు తీరుతున్నారు. తాను ఇస్తున్న మందుకు ఆయన డబ్బులేమీ వసూలు చేయడం లేదు. 

ఆయన ఇస్తున్న మందుతో ఒక్కరోజులోనే ఎంత తీవ్రమైన కేసైనా తగ్గిపోవడం, ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం వంటి జరుగుతున్నాయని చెబుతున్నారు, ఇంత వరకు ఈ వైద్యంపై ఒక్క రిమార్క్ కూడా రాలేదు. వేలాది మంది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వేలసంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు.

Also Read: ఆనందయ్య కరోనా మందు పంపిణీ నిలిపివేత.. రెండు రోజుల వరకు లేనట్టే..

ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఆ మందు కోసం వస్తున్నారు. ఎంతో మంది అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నవారు కూడా రెండు రోజుల్లో కోలుకొని వెళ్లిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారు.  కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ వస్తోందని, సీటీ స్కాన్ లో చెస్ట్ సివియారిటీ స్కోర్  24/25 ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే  జీరోకు వస్తోందని అంటున్నారు.ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చుంటున్నారని చెబుతున్నారు.

click me!