కెసిఆర్-యనమల ఏం మాట్లాడుకున్నారు ?

First Published Oct 19, 2017, 4:04 PM IST
Highlights
  • దాదాపు ఏడాదిన్నర క్రితం తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవటానికి విజయవాడ వచ్చారు.
  • ఆ సందర్భంగా ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో కెసిఆర్ ఏకాంతంగా మాట్లాడారు.
  • అంటే అర్ధమేంటి ? కెసిఆర్ ఏపి టిడిపి నేతలతో ప్రత్యేకంగా మాట్లాడటమన్నది పయ్యావుల కేశవ్ తోనే మొదలు కాదని.
  • క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుంటే బయట కృష్ణానది ఒడ్డున కెసిఆర్-యనమల కొద్దిసేపు విడిగా మాట్లాడుకున్నారు.
  • అయితే, వారిద్దరు ఏమి మాట్లాడుకున్నది ఇప్పటి వరకూ ఎవరికీ తెలీదు.

పై ఫొటో గుర్తుందా ? దాదాపు ఏడాదిన్నర క్రితం తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవటానికి విజయవాడ వచ్చారు. ఆ సందర్భంగా ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో కెసిఆర్ ఏకాంతంగా మాట్లాడారు. అంటే అర్ధమేంటి ? కెసిఆర్ ఏపి టిడిపి నేతలతో ప్రత్యేకంగా మాట్లాడటమన్నది పయ్యావుల కేశవ్ తోనే మొదలు కాదని.

మొన్న పరిటాల శ్రీరామ్ వివాహానికి కెసిఆర్ వెంకటాపురం గ్రామానికి వెళ్ళిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎంఎల్సీ పయ్యావుల కేశవ్ తో కెసిఆర్ ఏకాంతంగా మాట్లాడారు. దాంతో టిడిపిలో నిప్పు రాజుకుంది.

ఇపుడు తెలంగాణా టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏపి టిడిపి నేతలపై మండిపడటానికి అదే కారణం. అయితే, పయ్యావుల కన్నా ముందే యనమల కూడా కెసిఆర్ తో మాట్లాడారనటానికి సాక్ష్యమే పై ఫొటో. పైగా ఎక్కడో కూడా కాదు. చంద్రబాబు అధికారిక నివాసంలోనే. క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుంటే బయట కృష్ణానది ఒడ్డున కెసిఆర్-యనమల కొద్దిసేపు విడిగా మాట్లాడుకున్నారు. అయితే, వారిద్దరు ఏమి మాట్లాడుకున్నది ఇప్పటి వరకూ ఎవరికీ తెలీదు.

అయితే, తాజాగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్, ఏపి మంత్రి యనమలకు రూ. 2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును కట్టబెట్టారని బయటపట్టారు. కెసిఆర్ తో తనకున్న సన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చేట్లు చేసారని రేవంత్ చెప్పారు.

ఆ విషయం ఇపుడు టిడిపిలో సంచలనంగా మారింది. ఆ నేపధ్యంలోనే పై ఫొటోపై తాజాగా చర్చ మొదలైంది. రేవంత్ చెప్పిన మాటలకు అప్పట్లో కెసిఆర్, యనమల ఏకాంతంగా మాట్లాడుకున్నదానికి ఏమన్నా కనెక్షన్ ఉందేమో అని టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు.

click me!