యలమంచలి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు

Published : Aug 22, 2018, 12:26 PM ISTUpdated : Sep 09, 2018, 11:49 AM IST
యలమంచలి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు

సారాంశం

టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారని.. దీంతో తాను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి యలమంచలి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర్ల లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నారని.. శ్రీకాంత్ ఆరోపించారు. టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారని.. దీంతో తాను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్.. సెల్ఫీ వీడియో తీసుకొని తాను సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడో వివరించారు.  అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కాగా.. గమనించిన కుటుంబసబ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

వేలఎ కరాలు ఎందుకు? Jagan Sensational Comments on Amaravati | Jaganmohan Reddy | Asianet News Telugu
CM Nara Chandrababu Naidu Speech: మెప్మా, డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు గుడ్ న్యూస్ | Asianet Telugu