ఎక్కడ నుండి పోటీ చేయాలో రెండు రోజుల్లో స్పష్టత: వై.ఎస్. షర్మిల

By narsimha lode  |  First Published Jan 4, 2024, 4:03 PM IST

వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో ష
ర్మిల విలీనం చేశారు.  ఎక్కడి నుండి  పోటీ చేయాలనే దానిపై  కాంగ్రెస్ నాయకత్వం  రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇవ్వనుందని షర్మిల చెప్పారు.


న్యూఢిల్లీ: తాను ఎక్కడి నుండి పోటీ చేయాలని రెండు రోజుల్లో కాంగ్రెస్  పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వనుందని  వై.ఎస్. షర్మిల   చెప్పారు.వైఎస్ఆర్‌టీపీని  కాంగ్రెస్ లో విలీనం చేశారు వై.ఎస్. షర్మిల. గురువారం నాడు  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత  న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం  కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కాకినాడలో  వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే  ఈ వ్యాఖ్యల గురించి తనకు తెలియదన్నారు. 

also read:పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. షర్మిలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ  భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 15 శాతం ఓట్లు రాబట్టుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది.  రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో  2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.2023 మే లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. దరిమిలా  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది.

దక్షిణాది రాష్ట్రాలపై  కాంగ్రెస్ పార్టీ కేంద్రీకరించింది.  రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో  దక్షిణాది రాష్ట్రాల నుండి ఎక్కువ సీట్లను దక్కించుకోవాలనే వ్యూహన్ని రచిస్తుంది.  ఈ క్రమంలోనే  వై.ఎస్. షర్మిలను  కాంగ్రెస్ పార్టీలో చేర్చున్నారు ఆ పార్టీ నేతలు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో కాంగ్రెస్ కు బలమైన రాష్ట్రంగా ఉంది. 2004, 2009 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి  కాంగ్రెస్ పార్టీకి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  విజయం సాధించిన ఎంపీలు కీలకపాత్ర పోషించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో బలోపేతం కావడం కోసం కార్యాచరణను రూపొందిస్తుంది.

also read:కాంగ్రెస్‌లో చేరిన వై.ఎస్. షర్మిల: లోటస్ పాండ్‌లో విజయమ్మతో జగన్ భేటీ

వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరికను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడ ఇవాళ న్యూఢిల్లీకి వచ్చారు.  షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలు స్వాగతించారు.  వై.ఎస్. షర్మిలకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కీలక పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.  


 

click me!