చంద్రబాబుతో వై.ఎస్. షర్మిల భేటీ: కొడుకు పెళ్లికి రావాలని ఆహ్వానం

By narsimha lode  |  First Published Jan 13, 2024, 11:24 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబుతో  వై.ఎస్. షర్మిల  ఇవాళ భేటీ అయ్యారు.


హైదరాబాద్:  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి  కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్. షర్మిల  శనివారం నాడు  వచ్చారు.  చంద్రబాబుతో వై.ఎస్. షర్మిల భేటీ అయ్యారు.  తన కొడుకు  వై.స్. రాజారెడ్డి  వివాహానికి రావాలని ఆహ్వానించారు.  తన కొడుకు  వై.ఎస్. రాజారెడ్డి వివాహనికి రావాలని  చంద్రబాబుకు  వై.ఎస్. షర్మిల ఆహ్వానించారు. 

హైద్రాబాద్ లోని  చంద్రబాబు నివాసానికి వై.ఎస్. షర్మిల చేరుకున్నారు.  తన కొడుకు రాజారెడ్డి వివాహా ఆహ్వాన పత్రికను అందించారు. గత ఏడాది డిసెంబర్ లో  క్రిస్‌మస్ గిఫ్ట్ ను  వై.ఎస్. షర్మిల  చంద్రబాబు కుటుంబానికి పంపించారు. లోకేష్ కూడ షర్మిలకు క్రిస్‌మస్ గిఫ్ట్ ను పంపారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా  లోకేష్ పోస్టు చేశారు. 

Latest Videos

undefined

also read:ఆసక్తికరం: చంద్రబాబు ఇంటికి వై.ఎస్. షర్మిల

ఈ నెల  4వ తేదీన  వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  త్వరలోనే  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వై.ఎస్. షర్మిల క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే .అయితే ఈ ఆరోపణలను  చంద్రబాబు ఖండించారు. 

ఈ నెల  18వ తేదీన వై.ఎస్. రాజారెడ్డికి  అట్లూరి ప్రియల నిశ్చితార్ధం జరగనుంది.  ఈ ఏడాది ఫిబ్రవరి  17న  వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ మేరకు  పలువురు రాజకీయ నేతలకు  వై.ఎస్. షర్మిల ఆహ్వానాలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ  షర్మిల చంద్రబాబును కలిశారు.  తన కొడుకు పెళ్లికి  రావాలని చంద్రబాబును ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో ఇవాళ ఈ భేటీపై  రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది.  తెలంగాణలో పార్టీని ఏర్పాటు  చేసి ఆ పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక విషయమై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్యం ఠాగూర్  అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై  అనుసరించాల్సిన వ్యూహంపై  నేతలతో ఆయన చర్చించారు.  మాణిక్యం ఠాగూర్ గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా కూడ  పనిచేశారు. 

 

click me!