వై‌ఎస్ జగన్ మూడు రాజధానులు: విశాఖ ఏ మేరకు సేఫ్ ?

By Sandra Ashok Kumar  |  First Published Dec 31, 2019, 4:53 PM IST

ఒక నెల రోజుల్లోపు రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఒక్కసారి విశాఖపట్నానికి రాజధానిని తరలించిన వెంటనే అక్కడ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అక్కడ కార్యనిర్వహణ పనులు మొదలుపెట్టగానే...అక్కడ వీఐపీ, వివిఐపి ల తాకిడి ఎక్కవవుతుంది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి మార్చడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. హై పవర్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే, ఒక నెల రోజుల్లోపు రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 

ఒక్కసారి విశాఖపట్నానికి రాజధానిని తరలించిన వెంటనే అక్కడ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అక్కడ కార్యనిర్వహణ పనులు మొదలుపెట్టగానే...అక్కడ వీఐపీ, వివిఐపి ల తాకిడి ఎక్కవవుతుంది. ముఖ్యమంత్రి మొదలు ఇతర మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు అందరూ అక్కడకు వాచిపోతుంటారు. 

Latest Videos

undefined

also read రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా... గుణపాఠం తప్పదు: పవన్

ఇప్పుడు అదే ఒక సెక్యూరిటీ సమస్యను తెచ్చిపెట్టేదిలా కనబడుతుంది. విశాఖపట్నం జిల్లా లో ఇంకా నక్సల్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొద్ధి కాలం కిందనే టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ను నక్సలైట్లు హతమార్చిన విషయం గుర్తుండే ఉంటుంది. 

భౌగోళికంగా కూడా విశాఖపట్నం మావోయిస్టుల కదలికలు అత్యధికంగా ఉండే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు లేదా ఎఓబి పేరాంతానికి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు బాగా ఉండడమే కాకుండా ఈ ప్రాంతంలో వారికి పట్టు కూడా బలంగా ఉంది. బలిమెల రిజర్వాయర్ ఘటన అదే విషయం మనకు స్పష్టం చేస్తుంది. 

ఇక ఈ ఎఓబి ప్రాంతంలో వారి కదలికలు అధికంగా ఉండడంతోపాటు ఒరిస్సా రాష్ట్రాన్ని నక్సలైట్లు వారికి షెల్టర్ జోన్ గా భావిస్తుంటారు. ఇక అటునుంచి ఆనుకొని ఉన్న దండకారణ్య ప్రాంతంలో వారి పత్తేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన గ్రేహౌండ్స్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా వారు మన రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే పరిమితం. 

also read పైన కాషాయమైనా లోపలున్నది పసుపే: సుజనాపై వైసీపీ నేత వ్యాఖ్యలు

పక్క రాష్ట్రాలతోని ఇక్కడ సమన్వయము అత్యంత ముఖ్యం. ఆ సమన్వయము కోసం ఇప్పటికి కూడా ఇరు రాష్ట్రాల అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ అది అంత సులువుగా ముందుకు సాగడం లేదు. 

ఈ నేపథ్యంలో మరి విశాఖపట్నంలో అధికార యంత్రంగాన్ని మొత్తం కొలువుదీరితే అక్కడ భద్రతాపరమైన సమస్యలు ఎదురవ్వచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టుల ప్రాబల్యం చాలావరకు తగ్గినప్పటికీ...పోలీసులు మాత్రం 24x7 అప్రమత్తతో, చాలా జాగ్రత్తుగా పనిచేయాల్సి ఉంటుంది. 

పోలీసువారు సైతం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారట. ప్రభుత్వం కూడా సీక్రెట్ గా ఒక కమిటీని ఈ భద్రత అంశాలపైనా వేసిందట. వేచి చూడాలి రానున్న రోజుల్లో ఈ కమిటీ ఏం చెబుతోంది అని. 

click me!