రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న ప్రతి ఒక్కరికి గట్టి గుణపాఠం చెబుతానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని తరలింపును నిరసిస్తూ మందడంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు
రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న ప్రతి ఒక్కరికి గట్టి గుణపాఠం చెబుతానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని తరలింపును నిరసిస్తూ మందడంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.
ఏ రోజున కూడా ఇంతమంది ఆడపడుచులు రోడ్డు మీదకు వచ్చి నిరసన చేయడాన్ని తాను చూడలేదన్నారు పవన్ కల్యాణ్. భూముల్ని ఎలా అభివృద్ధి చేస్తారో రైతులకు ప్రభుత్వం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.
undefined
Also Read:నేను పోలీసు కొడుకునే: పోలీసులపై పవన్ ఫైర్
అమరావతిలో రాజధాని ఇష్టం లేదని గతంలోనే జగన్ చెప్పొచ్చు కదా... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఒప్పుకున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని... రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి జనం ఎందుకు వలస పోతున్నారని ఆయన ప్రశ్నించారు.
రాజధాని రైతులకు మద్దతుగా నిలిచేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలుసుకొనే కార్యక్రమానికి పోలీసులు అడ్డు తగిలారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల రైతులతో మాట్లాడిన తర్వాత మందడం వైపుకు పవన్ కళ్యాణ్ వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు.
సీఎం జగన్ సచివాలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని పోలీసులు పవన్ కళ్యాణ్‌కు అడ్డుపడ్డారు. సీఎం సచివాలయం నుండి వెళ్లిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ను తుళ్లూరు వెళ్లాలని పోలీసులు సూచించారు.
సీఎం వైఎస్ జగన్ సచివాలయం నుండి వెళ్లిపోయిన తర్వాత మందడం గ్రామానికి వెళ్లాలని పోలీసులు పవన్ కళ్యాణ్‌కు సూచించారు. అయితే మందడం గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్లకుండా వెంకటపాలెం వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. రోడ్డుపై ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మందడం -వెంకటపాలెం గ్రామాల మధ్య రోడ్డుపైనా నాలుగు చోట్ల పవన్ కళ్యాణ్ బైఠాయించారు.
Also Read:జగన్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: పవన్
రోడ్లపై పోలీసులు వేసిన ముళ్లకంచెను మందడం గ్రామస్తులు తొలగించారు.ఈ క్రమంలో ముళ్లకంచెలో కొందరు గ్రామస్థులు పడి గాయపడ్డారు. ఈ క్రమంలోనే ముళ్ల కంచెను దాటుకొని పవన్ కళ్యాణ్ మందడం వైపుకు వెళ్లారు.
ఈ క్రమంలోనే పోలీసులు పదే పదే ఆయనను అడ్డుకోవడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర అసహానానికి గురయ్యారు. తాను కూడ పోలీసు కొడుకునే అని ఒకానొక దశలో తేల్చి చెప్పారు. ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.