గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితా ఇదీ

By narsimha lode  |  First Published Dec 31, 2023, 1:39 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో   ఇంచార్జీల మార్పులకు సంబంధించి వైఎస్ఆర్‌సీపీ కసరత్తు తుది దశకు చేరింది.



అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను అభ్యర్థులను బరిలోకి దింపాలని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) భావిస్తుంది.ఈ మేరకు  వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  కసరత్తు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  11 అసెంబ్లీ ఇంచార్జీలను మార్చారు. మిగిలిన స్థానాల్లో  అభ్యర్థుల మార్పునకు సంబంధించి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని  40 నుండి  60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని జగన్మోహన్ రెడ్డి  భావిస్తున్నారు.

Latest Videos

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాల్లో  విజయం సాధించాలనే లక్ష్యంతో  వైఎస్ఆర్‌సీపీ వ్యూహంతో ముందుకు సాగుతుంది. దరిమిలా  రాష్ట్రంలోని  ఏ ఏ అసెంబ్లీ స్థానాల్లో  పార్టీ గెలుపు అవకాశాలపై  సర్వే ఆధారంగా  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. 


రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  అభ్యర్థుల మార్పులు  చేర్పులకు సంబంధించి  దాదాపుగా రెండు వారాల నుండి జగన్ కసరత్తు చేస్తున్నారు.  ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలను  పిలిపించుకొని జగన్  మాట్లాడుతున్నారు.


ఉభయ గోదావరి జిల్లాలతో పాటు టీడీపీ, జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ప్రాంతాల్లో అభ్యర్థులను మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖలో  ఆరు స్థానాల్లో మార్పులు చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. విజయనగరం, శ్రీకాకుళంలలో రెండు చోట్ల మార్చే అవకాశం ఉంది.  చిత్తూరు జిల్లాలో నాలుగు చోట్ల మార్పులు జరగనున్నాయి.

ఉమ్మడి కర్నూల్ లో 3 నియోజకవర్గాల్లో ఇంచార్జీలను మార్చనున్నారు.ప్రకాశంలో  ఐదు చోట్ల మార్పులు చేయాలని భావిస్తున్నారు. అయితే ఇందులో  మూడు చోట్ల మాత్రం మార్పు అనివార్యంగా కన్పిస్తుంది. 


నెల్లూరులో పార్టీ మారిన ఇద్దరి ప్లేస్ లో ఇప్పటికే ఇంచార్జీలను నియమించారు.ఉమ్మడి తూర్పు గోదావరిలో 7 చోట్ల అభ్యర్థుల మార్చారు.ఉమ్మడి పశ్చిమలో 5 చోట్ల కొత్త ఇంచార్జీలను ఖరారు చేశారు. 
ఉమ్మడి కృష్ణా జిల్లాలో  మూడు చోట్ల మార్పులు జరిగే అవకాశం ఉంది. 

వైసీపీ మార్పు చేసిన జాబితా ఇదే

జగ్గంపేట -తోట నరసింహం
అమలాపురం-పినిపే శ్రీకాంత్ 
ప్రత్తిపాడు- పరువుల సుబ్బారావు
పిఠాపురం -వంగా గీత
కాకినాడ రూరల్- కురసాల కన్నబాబు
కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
తుని -దాడిశెట్టి రాజా
రాజమండ్రి సిటీ -మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ -చెల్లుబోయిన వేణు
పి.గన్నవరం- మోకా రమాదేవి
రాజోలు- రాపాక వరప్రసాద్
కొత్తపేట- చీర్ల జగ్గిరెడ్డి
మండపేట- తోట త్రిమూర్తులు
రామచంద్రపురం- పిల్లి సూర్యప్రకాష్
పెద్దాపురం -దవులూరి దొరబాబు
రాజానగరం- జక్కంపూడి రాజా
రంపచోడవరం- నాగులుపల్లి దనలక్ష్మి
జగ్గంపేట -తోట నరసింహం
ఆనపర్తి -సూర్యనారాయణ రెడ్డి
ముమ్మడివరం -పొన్నాడ సతీష్
ఏలూరు -ఆళ్ల నాని
చింతలపూడి- విజయ జయరాజ్
పోలవరం- తెల్లం రాజ్యలక్ష్మి
నిడదవోలు -శ్రీనివాసుల నాయుడు
కొవ్వూరు- తానేటి వనిత
దెందులూరు- అబ్బయ్య చౌదరి
గోపాలపురం-  తలారి వెంకట్రావు
ఉంగుటూరు - శ్రీనివాసరావు
నరసాపురం -ప్రసాదరాజు
భీమవరం -గ్రంధి శ్రీనివాస్
పాలకొల్లు -గుడాల గోపి
ఉండి -పీవీఎల్ నరసింహరావు
ఆచంట- శ్రీరంగ రాజు
తాడేపల్లి గూడెం-  కొట్టు సత్యనారాయణ
తణుకు - కారుమూరి నాగేశ్వరరావు
పెనుకొండ -ఉషశ్రీచరణ్
మంత్రాలయం- బాలనాగిరెడ్డి
ఆదోని- బాల నాగిరెడ్డి
డోన్ -బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది.ఇవాళ సాయంత్రానికి  తుది జాబితాను వైఎస్ఆర్‌సీపీ  ప్రకటించే అవకాశం ఉంది. 

click me!