TDP: ఏపీలో తెలంగాణ ట్రెండ్.. చంద్రబాబు, పవన్ రెండు స్థానాల్లో పోటీ? అల్లుడి కోసం సీటు త్యాగం!

By Mahesh KFirst Published Dec 30, 2023, 5:57 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రధాన పార్టీలు సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఎంపికపై ప్రధాన దృష్టి పెట్టారు. ఏపీలోని ప్రధాన పార్టీలు తెలంగాణ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల తరహాలోనే ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది.
 

Chandrababu Naidu: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే.. అందరి కళ్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమాలపై పడ్డాయి. తెలంగాణలో ఎన్నికల వ్యూహాలు, వాటి ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఏపీలోని పార్టీలు అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మూడు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌లు రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. ఇందులో ఈటల తప్పితే రేవంత్, కేసీఆర్ వారి సొంత నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇదే ట్రెండ్‌ను ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది.

చంద్రబాబు నాయుడు ఇది వరకు ఎప్పుడూ రెండు చోట్ల పోటీ చేయలేదు. కానీ, ఈ సారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతోపాటు ఉత్తరాంధ్రలోనూ పోటీ చేసి ఈ రీజియన్‌లో టీడీపీని మరింత బలోపేతం చేయాలనే ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా భీమిలిని ఆయన తన రెండో స్థానంగా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా, పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Also Read: DSP Nalini: ఉద్యమబాట నుంచి ఆధ్యాత్మిక మార్గం.. సీఎంను కలిశాక మాజీ డీఎస్పీ నళిని కామెంట్

పవన్ కళ్యాణ్ గతంలోనూ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. గోదావరి జిల్లాలతోపాటు రాయలసీమలో పవన్ కళ్యాణ్‌కు ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. గతంలో పోటీ చేసిన భీమవరం నుంచి మరోసారి పోటీ చేస్తే.. గతంలో ఓడిన సింపతి కలిసి వస్తుందని భావిస్తున్నట్టు తెలిసింది. గతంలో చిరంజీవి గెలిచిన తిరుపతి స్థానం నుంచి కూడా పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది. గతంలో కంటే జనసేన ఈ సారి బలపడినట్టు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సారి కూడా కూటమితోనే బరిలోకి దిగుతున్నారు. గతంలో వామపక్షాలు, బీఎస్పీలో కలిసి బరిలోకి దిగగా ఈ సారి టీడీపీ, బీజేపీతో కలిసి పోటీలోకి దిగాలని ఆశిస్తున్నారు.

Also Read: Free Bus: హాస్టల్ వెళ్లడం ఇష్టంలేక 33 గంటలు బస్సుల్లోనే ప్రయాణించిన బాలిక.. చివరికి జేబీఎస్‌లో..

అల్లుడి కోసం సీటు త్యాగం

నారా లోకేశ్‌ను ఈ సారి ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఆయన గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి స్థానం చలనం చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను తప్పించి వైసీపీ ఓ బీసీ నేతను బరిలోకి దిగాలని డిసైడ్ అయింది. అందుకే ఇక్కడ లోకేశ్‌ను కాకుండా ఓ బీసీ అభ్యర్థినే బరిలోకి దించాలని టీడీపీ అనుకుంటున్నట్టు తెలిసింది. అలాగే.. టీడీపీకి సేఫ్ సీటు అయినా హిందూపురం నుంచి లోకేశ్‌ను బరిలోకి దించాలని అనుకుంటున్నది. బాలయ్య ఈ సీటును అల్లుడు లోకేశ్‌ కోసం త్యాగం చేయనున్నారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్‌తోపాటు ఉత్తరాంధ్రలో పోటీ చేస్తే ఉభయ పార్టీలకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తున్నది.

click me!