చక్రపాణి సవాలుకు టిడిపి స్పందిస్తుందా ?

Published : Aug 02, 2017, 06:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
చక్రపాణి సవాలుకు టిడిపి స్పందిస్తుందా ?

సారాంశం

ఎంఎల్సీకి రాజీనామా చేయని విషయాన్ని స్వయంగా చక్రపాణే మీడియాలో చెప్పినా ఆ విషయాన్ని టిడిపి నేతలెవరూ ప్రశ్నించటం లేదు. రాజీనామాల విషయంలో చక్రపాణి సవాలుకు ఫిరాయింపు మంత్రి, ఎంఎల్ఏలు స్పందిస్తారా లేదా అన్నది ఆశక్తిగా మారింది. ఒకవేళ చక్రపాణిని రాజీనామా చేయమని టిడిపి వాళ్లెవరైనా అడిగితే వెంటనే ఫిరాయింపుల రాజీనామాల అంశం ప్రస్తావనకు వస్తుంది.

నంద్యాల తాజా పరిణామాల్లో తెలుగుదేశంపార్టీ భలే ఇరుకున పడిపోయింది. బుధవారం టిడిపికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే కదా? ఇక్కడే చక్రపాణి చిన్న ట్విస్టు ఇచ్చారు. టిడిపికి రాజీనామా చేసిన చక్రపాణి ఎంఎల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఆ మధ్య జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చక్రపాణి ఎంల్సీగా గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

ఎంఎల్సీకి రాజీనామా చేయని విషయాన్ని స్వయంగా చక్రపాణే మీడియాలో చెప్పినా ఆ విషయాన్ని టిడిపి నేతలెవరూ ప్రశ్నించటం లేదు. పైగా ‘ఎంఎల్సీ రాజీనామా పత్రం తన జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను, మీరు రాజీనామా చేయండి నేను రాజీనామా చేస్తాను’ అని సవాలు చేసినా కనీసం స్పందించటం లేదు. ఇపుడిదే విషయం నంద్యాలలో హాట్ టాపిక్ గా మారింది. రాజీనామాల విషయంలో చక్రపాణి సవాలుకు ఫిరాయింపు మంత్రి, ఎంఎల్ఏలు స్పందిస్తారా లేదా అన్నది ఆశక్తిగా మారింది.

వైసీపీ నుండి గెలిచిన వారి చేత రాజీనామా చేయించకుండానే చంద్రబాబునాయుడు టిడిపిలోకి లాక్కున్నారు. అందుకే, ఇపుడు చక్రపాణి రాజీనామాను వారెవరూ ప్రశ్నించలేకున్నారు. ఒకవేళ చక్రపాణిని రాజీనామా చేయమని టిడిపి వాళ్లెవరైనా అడిగితే వెంటనే ఫిరాయింపుల రాజీనామాల అంశం ప్రస్తావనకు వస్తుంది. అందుకే ఫిరాయింపులందరూ తేలుకుట్టిన దొంగల్లాగుండిపోయారు. మొత్తానికి టిడిపి నోరు మూయించేందుకు చక్రపాణి భలే ఎత్తేసారు.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu