పాదయాత్రపై అసెంబ్లీలో ప్రకటన చేస్తారా ?

Published : Oct 22, 2017, 12:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
పాదయాత్రపై అసెంబ్లీలో ప్రకటన చేస్తారా ?

సారాంశం

తన పాదయాత్రకు సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారా? వైసీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. నవంబర్ 2వ తేదీ నుండి జగన్ ఆరుమాసాల పాదయాత్ర మొదలుపెట్టనున్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఒకసారి పాదయాత్ర మొదలైతే అసెంబ్లీ సెషన్లకు కూడా జగన్ వచ్చే అవకాశాలు లేవు.

తన పాదయాత్రకు సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారా? వైసీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. నవంబర్ 2వ తేదీ నుండి జగన్ ఆరుమాసాల పాదయాత్ర మొదలుపెట్టనున్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఒకసారి పాదయాత్ర మొదలైతే అసెంబ్లీ సెషన్లకు కూడా జగన్ వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే నవంబర్ మొదటివారంలో వారం రోజుల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అదేవిధంగా ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు కూడా మొదలవుతాయి.

జగన్ పాదయాత్ర నవంబర్ నుండి ఏప్రిల్ వరకూ జరుగుతుంది. కాబట్టే నవంబర్ లో తన పాదయాత్ర మొదలైన తర్వాతే అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవుతాయి. ఇక్కడే వైసీపీ నేతల నుండి ఓ సూచన అందుతోందట జగన్ కు. ఎలాగూ భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది అనుమానమే. కాబట్టి నవంబర్ మొదటివారంలో మొదలయ్యే అసెంబ్లీ సీమావేశాల్లో ఒక్కరోజ పాల్గొనాలని నేతలు సూచిస్తున్నారట.

సభకు హాజరయ్యేది కూడా పాదయాత్ర ఉద్దేశ్యాన్ని సభలో ప్రకటిస్తే మంచి మైలేజి వస్తుందని వైసీపీ నేతలు సూచిస్తున్నారట. వైసీపీ ఆలోచన బాగానే ఉందికానీ మరి టిడిపి పడనిస్తుందా అన్నది అనుమానమే.

అదే సమయంలో అసెంబ్లీలో తనకు బదులుగా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు ? అన్న విషయం కూడా సోమవారం జగన్ అధ్యక్షతన జరిగే వైసీపీ ఎంఎల్ఏలు నేతల సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం.

నవంబర్ 7 వ తేదీ మొదలయ్యే సమావేశాలు ఆరు రోజుల పాటు జరుగుతుంది. మధ్యలో 10వ తేదీ శుక్రవారం. కేసు విచారణలో వ్యక్తిగత మినహాయింపుకు కోర్టు జగన్ కు అనుమతి ఇవ్వకపోతే శుక్రవారం జగన్ ఎటూ కోర్టులో హాజరవ్వాల్సుంటుంది. పనిలో పనిగా కోర్టుకు హాజరైన తర్వాత జగన్ వెంటనే వెలగపూడికి చేరుకుని అసెంబ్లీకి వస్తే బాగుంటుందని పలువురు వైసీపీ నేతలంటున్నారు. మరి, జగన్ ఏం చేస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu