బుట్టాకు బెదిరింపు కాల్స్..ఆందోళనలో ఎంపి

Published : Oct 22, 2017, 08:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బుట్టాకు బెదిరింపు కాల్స్..ఆందోళనలో ఎంపి

సారాంశం

వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన కర్నూలు ఎంపి బుట్టా రేణుకకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయట. అపరిచితుల నుండి వస్తున్న ఫోన్లలో ఏకంగా ఎంపిని చంపేస్తామనే బెదిరిస్తున్నారట.

వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన కర్నూలు ఎంపి బుట్టా రేణుకకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయట. అపరిచితుల నుండి వస్తున్న ఫోన్లలో ఏకంగా ఎంపిని చంపేస్తామనే బెదిరిస్తున్నారట. వైసీపీని వదిలేది లేదంటూనే ఇటీవలే బుట్టా టిడిపిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, అనుచరులతో కలిసి చంద్రబాబునాయుడును కలిసిన ఎంపి తర్వాత తాను టిడిపిలో చేరలేదని, కేవలం మద్దతు మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ అయోమయంలో పడేసారు. సరే ఎంపి విషయం ఎలాగున్నా అప్పటి నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.

బుట్టా రేణుక వ్యవహారాన్ని వైసీపీ అధినేత ఏమాత్రం పట్టించుకోకపోయినా ఎవరికో బాగా మండినట్లుంది.  అందుకే పార్టీ మారిన తర్వాత నుండి  ఆమెకు కొంతమంది అపరిచితులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట. ‘మిమ్మల్ని చంపేస్తాం.. తిరిగి వచ్చేయండ’ని. ఇలా ఇప్పటికే 15 నెంబర్ల నుంచి బుట్టా రేణుకకు ఫోన్ వచ్చినట్లు సమాచారం. వస్తున్న ఫోన్లన్నీ ఎవరు చేస్తున్నారో అర్ధం కాక ఎంపిలో ఆందోళన పెరిగిపోతోంది. అందుకే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. బెదిరింపుల వ్యవహారం ఎంతదాకా వెళుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

చేతుల మీద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చిన మహిళ | CBN Full Speech At House Pattas Distribution
మహిళ స్పీచ్ కి దండంపెట్టేసిన బాబు | Chandrababu Giving House Pattas To Beneficiaries