
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో తిరిగి స్వదేశానికి వచ్చిన గుంటూరు జిల్లా మంగళగిరికి (mangalagiri) చెందిన వూట్ల సాంబశివరావు కుమార్తె వూట్ల శ్రీలక్ష్మిని జనసేన (janasena) పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు (chillapalli srinivasarao) పరామర్శించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దాదాపు 2000 మంది మెడికల్ విద్యార్థులు ఉక్రెయిన్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారని తెలిపారు.
ఇందులో ఎక్కువ శాతం మంది విద్యార్థులు దిగువ మధ్య తరగతి కుటుంబీకులేనని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నట్లు చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు sk. ఖైరుల్లా, మునగాల వెంకట మారుతి, నందం మోహన్ రావు , వెనిగళ్ళ నవీన్ , వెనిగళ్ళ నరేష్, కొడాలి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇకపోతే.. ఉక్రెయిన్‌లో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం సోమవారం (మార్చి 21) బెంగళూరుకు చేరుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. నవీన్ శేఖరప్ప మృతదేహం ఇక్కడికి రాగానే వైద్య పరిశోధనల కోసం అందించనున్నారు. దీనికి తల్లిదండ్రులు అంగీకారం తెలిపారు.
ఎవరీ నవీన్ శేఖరప్ప ?
ఉక్రెయిన్‌లో మరణించిన నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ 21 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి. ఆయన కర్ణాటకలోని హవేరీ జిల్లా నివాసి. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీకి లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న సమయంలో నవీన్ ఆహారం కొనుక్కోవడానికి క్యూలో నిలబడి ఉన్నారు. అయితే ఆ కాల్పుల్లో స్టూడెంట్ మృతి చెందాడు. ఆయన మృతి పట్ల భారత్ మొత్తం ఒక్కసారిగా ద్రిగ్భాంతికి గురయ్యింది. అక్కడ చిక్కుకున్న విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. కాగా కర్ణాటక సీఎం.. నవీన్ శేఖరప్ప కుటుంబానికి రూ.25 లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
అయితే నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహాన్ని రాష్ట్రంలోని వైద్య కళాశాలకు దానం చేయాలని ఆయన కుటుంబం నిర్ణయించింది. ఈ మేరకు మృతుడి తండ్రి శేఖరప్ప శుక్రవారం మాట్లాడుతూ.. తన కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన దేహాన్ని చివరిసారిగా చూడగలమని తెలియగానే ఆ దుఃఖం తొలగిపోయిందని అన్నారు. అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని దావణగెరెలోని ఎస్‌ఎస్ మెడికల్ కాలేజీకి దానం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు.
"