స్వీపర్ జీతం నెలకు అక్షరాల లక్ష.. అయినా చివరికి మిగిలేది కన్నీరే

By sivanagaprasad kodatiFirst Published Oct 7, 2018, 4:01 PM IST
Highlights

స్వీపర్ జీతం నెలకు లక్షన్నరా..? ఏంటీ ఇదెక్కడో విదేశాల్లో కాదు.. మన భారతదేశంలోనే.. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లోనే. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో పనిచేసే కోల వెంకట రమణమ్మ నెల జీతం అక్షరాల.. రూ.1,47,722.  

1978లో విద్యుత్ శాఖలో రోజువారీ కూలీగా చేరిన రమణమ్మ 1981లో పర్మినెంట్ ఉద్యోగిగా మారింది. నాటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలోనే పని చేస్తోంది. ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్ల దాటడం.. తాజాగా విద్యుత్ శాఖలో సంస్కరణలు చేపట్టడంతో రమణమ్మతో పాటు ఆ శాఖలో పనిచేస్తోన్న చాలామంది నాలుగో తరగతి ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరిగాయి.

ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఉదయం 8 గంటలకు క్యారేజ్ తీసుకుని.. రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్తుంది. నెలకు లక్ష జీతం వస్తుంది.. ఇంకేముంది ఎలాంటి బాధలు ఉండవు అని అనుకోవచ్చు.. కానీ రైల్వే శాఖలో పనిచేసే భర్త చనిపోవడంతో పాటు.. ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకుకి గుండెజబ్బు, ఫిట్స్‌ వస్తుండటంతో.. అతని వైద్యానికే రమణమ్మ జీతం అంతా సరిపోతోంది. ఇది ఆమెను మానసికంగా క్రుంగదీస్తోంది. 

click me!