భర్త గుడ్డివాడు.. ఎలాగూ కనపడదు కదా అని.. ప్రియుడితో

By ramya neerukondaFirst Published 12, Sep 2018, 2:13 PM IST
Highlights

పుట్టుకతో భర్త పుష్పరాజు గుడ్డివాడు కావడంతో ఈమె ఆడిందే ఆటగా సాగింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒక ఆటోడ్రైవర్‌తో అక్రమ సంబంధం నడుపుతోంది. ఇంతటితో ఆగకుండా ఆ ఆటోడ్రైవర్‌కు బంగారం, డబ్బులు ఇవ్వాలనుకుంది. 

భర్త గుడ్డివాడు.. ఎలాగూ ఏమీ కనపడదు అని ధీమాతో ఇంట్లో అత్తమామల కళ్ల గప్పి.. ఆటో డ్రైవర్ తో అక్రమసంబంధం పెట్టుకుంది. అక్కడితో ఆగకుండా.. సొంత ఇంట్లోనే కన్నమేసింది. చివరకు పోలీసుల ముందు నిజం ఒప్పుకుంది. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...జగన్నాథపురానికి చెందిన ముత్తు రామారావు, పుణ్యావతి దంపతుల కుమారుడైన పుష్పరాజుకు నరసన్నపేటకు చెందిన సొంత మేనకోడలు నాగమణితో 12ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు. పుట్టుకతో భర్త పుష్పరాజు గుడ్డివాడు కావడంతో ఈమె ఆడిందే ఆటగా సాగింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒక ఆటోడ్రైవర్‌తో అక్రమ సంబంధం నడుపుతోంది. ఇంతటితో ఆగకుండా ఆ ఆటోడ్రైవర్‌కు బంగారం, డబ్బులు ఇవ్వాలనుకుంది. 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తెరిచి అందులో ఉన్న 16 తులాల బంగారం, రూ.2లక్షల35వేలు నగదు దొం గలించి బీరువా తాళాలు బియ్యం డబ్బా ఆడుగులో దాచిపెట్టింది. ఏమీ తెలియనట్టుగా అత్తమామలను నమ్మించి తాళాలు పోయావని అబద్ధాలు చెప్పింది. ఇటీవల నాగమణి సోదరుడు ప్రమాదంలో మృతిచెందడంతో కన్నవారి ఇంటికి నాగమణి వెళ్లింది. ఈ సమయంలో అత్తమామలు తాళాల కోసం ఇంట్లో వెతకగా బియ్యం డబ్బాలో తాళాలు కనిపించాయి. వీటితో బీరువా తెరిచి చూడగా బంగారం, నగదు మాయమైనట్లు గుర్తించారు. దీనిపై జూలై 14న సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
పోలీసుల సమక్షంలో కోడలు నాగమణి తప్పు ఒప్పుకుంది. అయితే పోలీసులు దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. మళ్లీ ఆగస్టు 19న గ్రామంలో పెద్దల సమక్షంలో దొంగతనం చేసిన రూ.2లక్షల35వేల నగదు, 14 తులాల బంగారం ఆటోడ్రైవర్‌కు ఇచ్చినట్లు తెలిపింది. తమ కోడలిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని.. తమ సొమ్ము తమకు అప్పగిస్తే చాలని వారు పోలీసులను వేడుకున్నారు. 

Last Updated 19, Sep 2018, 9:24 AM IST