పోలవరం గ్యాలరీ వాక్‌: దేవాన్ష్‌తో బాబు అడుగులు

By narsimha lodeFirst Published 12, Sep 2018, 12:00 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు వద్ద గ్యాలరీ వాక్‌ను  బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ప్రారంభించారు. చంద్రబాబునాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి  గ్యాలరీవాక్‌లో పాల్గొన్నారు.

పోలవరం: పోలవరం ప్రాజెక్టు వద్ద గ్యాలరీ వాక్‌ను  బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ప్రారంభించారు. చంద్రబాబునాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి  గ్యాలరీవాక్‌లో పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టువద్ద  గ్యాలరీవాక్‌లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన కుటుంబసభ్యులతో హెలికాప్టర్ లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఆయన సతీమణి భువనేశ్వరీ, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి, మనమడు దేవాన్ష్  కూడ  పాల్గొన్నారు.

గ్యాలరీవాక్‌లో దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  స్పిల్‌వే వద్ద  పైలాన్ ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు.  ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులు  తమ కుటుంబసభ్యులతో  కలిసి  గ్యాలరీవాక్‌లో పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులను చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులకు వివరించారు. మనవడు దేవాన్ష్‌ను వెంటపెట్టుకొని చంద్రబాబునాయుడు గ్యాలరీ వాక్‌లో పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు తమ కుటుంబసభ్యులకు వివరించారు. ఇదిలా ఉంటే  పోలవరం ప్రాజెక్టు వద్ద  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ పూజల్లో  పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST