చుక్కలు చూపించిన మహిళలు

Published : Sep 21, 2017, 12:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
చుక్కలు చూపించిన మహిళలు

సారాంశం

ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో బుధవారం రమేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కు మహిళలు చుక్కులు చూపించారు. సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలో అడుగుపెట్టాలని ఎంపీకి స్థానిక మహిళలు తేల్చిచెప్పారు. దాంతో ఏం చేయాలో తెలీక ఎంపి అక్కడి నుండి వెళ్ళిపోయారు.  

టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కు మహిళలు చుక్కులు చూపించారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో బుధవారం రమేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలో అడుగుపెట్టాలని ఎంపీకి స్థానిక మహిళలు తేల్చిచెప్పారు. దాంతో ఏం చేయాలో తెలీక ఎంపి అక్కడి నుండి వెళ్ళిపోయారు.  ఈ ఘటన కడప జిల్లాలోని చాపాడు గ్రామంలో చోటుచేసుకుంది.

ఇంతకీ జరిగిందేమిటంటే,  'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమంలో భాగంగా పలువురు టీడీపీ నేతలతో కలిసి సభ్యత్వ నమోదుకు సీఎం రమేష్ చాపాడు గ్రామానికి వెళ్లారు. అక్కడ సభ్యత్వ నమోదు చేసుకుంటూ జెడ్పీ హైస్కూల్‌ వెనుక వీధిలో అడుగుపెట్టారు. ఎంపిని చూడగానే ఒక్కసారిగా వీధిలోని జనాలందరూ ఒకచోకట గుమిగూడారు. ఎంపి తమ వీధిలో తిరిగేందుకు లేదని మహిళలు అడ్డుకున్నారు. మూడేళ్లుగా సిమెంట్ రోడ్డు వేయమని మొత్తుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. సిమెంట్‌ రోడ్డు వేశాకే తమ వీధిలోకి అడుగుపెట్టాలని స్పష్టంగా చెప్పారు.

వారిని శాంతింపచేయటానికి ఎంపితో పాటు స్ధానిక నేతలు ప్రయత్నించారు. తమకు హామీలు అవసరం లేదని రోడ్డు వేసిన తర్వాతే తమ వీధిలోకి రావాలంటూ స్పష్టం చేశారు. అయినా ఎంపి మాట్లాడేందుకు ప్రయత్నించటంతో శాంతించని మహిళలు మరింత రెచ్చపోయారు. అదే సమయంలో పలువురు సర్పంచ్‌లు స్పెషల్‌ గ్రాంటు కింద చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని సీఎం రమేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఎంపి అక్కడినుండి జారుకున్నారు.                         

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Attends Parliament Committee Workshop Inauguration| Asianet News Telugu
Nara Lokesh Speech: లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవంలో మంత్రి నారాలోకేష్ | Asianet News Telugu