రాష్ట్రమంతా భూసమీకరణ విధానం

First Published Sep 21, 2017, 11:16 AM IST
Highlights
  • ఇక నుండి రాష్ట్రమంతా భూసమీకరణ విధానాన్ని అవలంభించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు.
  • అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంతంలో రైతులకు చెందిన 34 వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించిన సంగతి అందరూ చూసిందే.
  • అదే పద్దతిని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని తాజాగా జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు.
  • ఎందుకంటే, రాష్ట్రం మొత్తం మీద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్ళను నిర్మించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక నుండి రాష్ట్రమంతా భూసమీకరణ విధానాన్ని అవలంభించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంతంలో రైతులకు చెందిన 34 వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించిన సంగతి అందరూ చూసిందే. అదే పద్దతిని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని తాజాగా జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు. ఎందుకంటే, రాష్ట్రం మొత్తం మీద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్ళను నిర్మించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు భారీ ఎత్తున భూములు కావాలి. అయితే ప్రభుత్వానికి అవసరమైన భూములు అందుబాటులో లేవు. ప్రైవేటు వ్యక్తుల నుండి భూములు కొనాలంటే చాలా ఖరీదు కాబట్టి అయ్యేపని కాదు.

అందుకే అవసరమైన ప్రతీచోటా భూసమీకరణ విధానాన్నే అనుసరించాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ఆ విధానాన్ని నంద్యాలలో అమలు చేస్తున్నారు కూడా. ఎలాగంటే, నంద్యాలలో 13 వేల ఇళ్ళను నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే, అందుకు అవసరమైన భూముల్లేవు. కాబట్టి నంద్యాల పట్టణంలో అయులూరుమెట్ట, ఎస్ఆర్బీసీ కాలనీల్లో స్ధలాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే అప్పటికే కాంగ్రెస్ హయాంలో పట్టాలు పొందిన వారు, ఇళ్ళు నిర్మించుకున్నవారున్నారు. అయినా సరే, వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించి, స్ధలాలను ప్రభుత్వం లాగేసుకుంది.

రాష్ట్రం మొత్తం మీద స్ధలాలను సమీకరించాలని చంద్రబాబు తాజగా చెప్పటంలో బహుశా ఉద్దేశ్యం అదే కావచ్చు. కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఇళ్ళపట్టాలను, స్ధలాలను టిడిపి ప్రభుత్వం లాగేసుకుని మళ్ళీ పేదలకే ఇళ్ళు కట్టిస్తామని చెప్పటం చంద్రబాబుకే చెల్లింది. మరి, ఇటువంటి పోకడలు ఎంతకాలం సాగుతాయో చూడాలి.

 

click me!