ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డులో లైంగిక వేధింపులు: 20 రోజులుగా మహిళా ఉద్యోగినుల ఆందోళన

By narsimha lodeFirst Published Sep 20, 2021, 3:21 PM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్‌సీ బోర్డులో అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని మహిళా ఉద్యోగినులు ఆందోళనకు దిగారు. 20 రోజులుగా తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్‌సీ బోర్డులో అడిషనల్ డైరెక్టర్  సుబ్బారెడ్డి తమను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా ఉద్యోగినులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు  అడిషనల్ డైరెక్టర్  సుబ్బారెడ్డి తమను మూడేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఈ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు ఆరోపించారు. ఈ విషయమై ఎదురుతిరిగితే  సస్పెండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడ ఫలితం లేకుండాపోయిందని వారు ఆరోపించారు. 20 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా కూడ అధికారులు ఎవరూ కూడ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశ యాప్ సహా దిశ చట్టం తీసుకొన్న జగన్ ప్రభుత్వం తమ ఆందోళనల విషయంలో స్పందించాలని మహిళా ఉద్యోగినులు కోరుతున్నారు. మహిళా ఉద్యోగినులకు సంస్థలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులు కూడ మద్దతు పలికారు.

 

click me!