రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో భరత్ సెల్పీ దిగడాన్ని జక్కంపూడి రాజా తప్పుబట్టారు. ఒకే పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య వైరం ఈ వ్యాఖ్యల ద్వారా బట్టబయలైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పై అదే పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సీరియస్ అయ్యారు. ఎంపీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ మార్గాని భరత్ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ మార్గాని భరత్ సర్వనాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణతో ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీలు తీసుకోవడాన్ని జక్కంపూడి రాజా తప్పుబట్టారు. సీఎం జగన్ ను గతంలో ఇబ్బంది పెట్టిన లక్ష్మీనారాయణతో ఎంపీ మార్గాని భరత్ కు పనేంటని ఆయన ప్రశ్నించారు.ఎంపీ భరత్ వి పిచ్చి చేష్టలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు.
రౌడీషీటర్లుర భూ కబ్జాదారులు ఎంపీ భరత్ వెనుక ఉన్నారని జక్కంపూడి రాజా ఆరోపించారు. ఎంపీ భరత్ తనను ఏమీ చేయలేరని ఆయన తేల్చి చెప్పారు.ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకొందని ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజా వ్యాఖ్యలపై ఎంపీ భరత్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.