విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఆటో డ్రైవర్ ని చితకబాదిన తల్లి

Published : Mar 18, 2020, 02:07 PM IST
విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఆటో డ్రైవర్ ని చితకబాదిన తల్లి

సారాంశం

తనను ప్రేమించాలంటూ బాలిక వెంట పడుతూ ఉండేవాడు.  రమేష్‌ తరచూ గ్రామంలోని బంధువుల ఇంటికి వస్తూ బాలికను వేధించేవాడు. అంతేకాకుండా  బాలిక పేరును  శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి రెండుసార్లు మందలించారు.  

స్కూల్ కి వెళ్లే విద్యార్థిని పట్ల ఓ ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. తరచూ బాలికను వేధించేవాడు. ఈ విషయం చివరకు బాలిక తల్లికి తెలిసింది. అంతే.. ఆ ఆటో డ్రైవర్ ని పట్టుకొని చితకబాదింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో చోటుచేసుకుంది.

Also Read సోషల్ మీడియాలో వ్యభిచార దందా... ఈజీ మనీ కోసం కాలేజీ యువతులు...

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాలకోడేరు మండలం విస్సాకోడేరు హైస్కూల్‌లో చదువుకుంటున్న బాలికను మొగల్తూరు మండలం పేరుపాలానికి చెందిన ఆటో డ్రైవరు తన్నేటి రమేష్‌ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలంటూ బాలిక వెంట పడుతూ ఉండేవాడు.  రమేష్‌ తరచూ గ్రామంలోని బంధువుల ఇంటికి వస్తూ బాలికను వేధించేవాడు. అంతేకాకుండా  బాలిక పేరును  శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి రెండుసార్లు మందలించారు.

అయినప్పటికీ రమేష్‌ బాలిక వెంటపడుతుండడంతో ఐదు రోజుల క్రితం బాలిక తల్లి పాఠశాల వద్దకు రమేష్‌ను ఈడ్చుకు వచ్చి విద్యార్థులందరి ముందు చేతికి దొరికిన వస్తువులతో దేహశుద్ధి చేసింది. అయితే... ఆమె అలా ఆటో డ్రైవర్ ని చితకబాదుతుండగా స్థానికులు వీడియో తీశారు. కాగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా... ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?