నాలుగు నెలల క్రింద అదృశ్యం: పేడకుప్పలో మహిళ అస్తిపంజరం

By telugu teamFirst Published Apr 12, 2021, 7:09 AM IST
Highlights

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఓ గ్రామంలోని పేడకుప్పలో మహిళ అస్తిపంజరం తేలింది. దాన్ని నాలుగు నెలల క్రితం అదృశ్యమైన మహిళదిగా పోలీసులు గుర్తించారు.

చిత్తూరు: ఓ మహిళ నాలుగు క్రితం అదృశ్యమైంది. ఆమె అస్తిపంజరం పేడ కుప్పలో తేలిన సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం నారాయణపురం పంచాయతీ విశాలాక్షి నగర్ లో చోటు చేసుకుంది. ఈ విషయం ఆదివారంనాడు వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను సిఐ ఎంఆర్ కృష్ణమోహన్ వెల్లడించారు 

విశాలాక్షినగర్ కు చెందిన ఉష ఖమ్మంకు చెందిన నాగరాజు అలియాస్ నిరంజన్ ను ప్రేమపెళ్లి చేసుకుంది. తల్లి అమ్ములుతో కలిసి ఉష దంపతులు నివసిస్తున్నారు. వారు విశాలాక్షినగర్ లో కొద్ది రోజుల క్రితం ఇల్లు కట్టుకున్నారు. అందుకు రూ.5 లక్షలు అప్పు చేశారు. ఉష శ్రీసిటిలోని ఓ మొబైల్ కంపెనీలో పనిచేస్తోంది. నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు.

దాంతో పని చేసి సంపాదించకపోతే అప్పులు ఎలా తీరుతాయని అత్త అమ్ములు నిలదీస్తూ వచ్చింది. ఈ క్రమంలో అమ్ములు నిరుడు డిసెంబర్ లో కనిపించకుండా పోయింది. తల్లి అదృశ్యంపై ఉష ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని నాగరాజు నచ్చజెబుతూ వచ్చాడు. 

నెల రోజులు గడిచినా తల్లి జాడ తెలియకపోవండతో ఉష జనవరి 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజున పని ఉందంటూ నాగరాజు ఖమ్మం వెళ్లి తిరిగి రాలేదు. 

ఉష ఇంటి ఆవరణలో ఉన్న పేడ కుప్పను తొలగించాలని గత కొద్దిరోజులుగా పక్కింటి వారు గొడవ చేస్తూ వస్తున్నారు దీంతోో ఆదివారంనాడు ఉష పేడ దిబ్బను వేరే చోటికి తరలించడానికి పూనుకుంది. ఈ క్రమంలో అందులో మనిషి పుర్రె ఎముకలు బయటపడ్డాయి దానిపై ఉష పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అస్తిపంజరాన్ని వెలికి తీయించారు అమ్ములు చీర, నాగరాజు లుంగిలను పేడ దిబ్బలో గుర్తించారు. దీంతో మృతురాలిని అమ్ములుగా పోలీసులు గుర్తించారు అమ్ములు మృతికి నాగరాజు కారణమని పోలీసులు కేసే నమోదు చేశారు. 

click me!