జగన్ బెయిల్‌పై రేపు కీలక తీర్పు: బాంబు పేల్చిన రఘురామకృష్ణంరాజు

By Siva KodatiFirst Published Apr 11, 2021, 9:51 PM IST
Highlights

వైసీపీ ఫైర్‌బ్రాండ్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి బాంబు పేల్చారు. సీఎం జగన్ బెయిల్ విషయంలో రేపు సీబీఐ కోర్టులో కీలక తీర్పు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో వాదనలు ఇప్పటికే పూర్తి అయ్యాయని ... పరిస్థితి ఇలాగే కొనసాగితే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

కాగా సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్మోహన్‌రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు ఆయన చెప్పారు.

కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, ఆయన త్వరగా కేసుల నుంచి బయటపడాలనే ఈ కేసు వేశానని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.  ప్రత్యర్థులు నానా రకాలుగా మాట్లాడటం బాధాకరమని, వారికి అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకపోవడం... అనుమానించే విధంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. 

click me!