ఎమ్మార్వో ఆఫీస్ ముందు మహిళ నిరసన: ఇద్దరు పిల్లలతో రాత్రంతా ఆందోళన

Published : Jul 20, 2021, 10:49 AM ISTUpdated : Jul 20, 2021, 10:50 AM IST
ఎమ్మార్వో ఆఫీస్ ముందు మహిళ నిరసన:  ఇద్దరు పిల్లలతో రాత్రంతా ఆందోళన

సారాంశం

 విజయనగరం జిల్లాలో ఇద్దరు పిల్లలతో రాత్రంతా ఎమ్మార్వో ఆఫీసు ముందు మహిళ నిరసనకు దిగింది. తన భూమికి పట్టా ఇవ్వాలని కోరుతూ ఆమె ఆందోళన చేసింది. రాత్రిపూట ఆమె ఆందోళన చేయడం  జిల్లాలో కలకలం రేపుతోంది.

విజయనగరం: విజయనగరం జిల్లాలో  తహసీల్దార్  కార్యాలయం ఎదుట ఓ మహిళ నిరసనకు దిగింది. రాత్రిపూట ఎమ్మార్వో కార్యాలయం ముందు ఇద్దరు పిల్లలతో కలిసి ఆందోళన చేసింది.జిల్లాలోని జబిలిపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం నాడు రాత్రి  నిరసనకు దిగింది. తన  భూమికి పట్టా ఇవ్వాలని ఆమె నిరసన వ్యక్తం చేసింది.

ఈ విషయమై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా కూడ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని బాధితురాలు  ఆరోపిస్తోంది.ఈ విషయమై తనకు న్యాయం చేయాలని బాధితురాలు రెవిన్యూ ఉన్నతాధికారులను కోరుతుంది. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ  బాధితులు పలు రకాల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ మహిళ మాత్రం తన పిల్లలతో కలిసి రాత్రిపూట కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగడం కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో రెవిన్యూ కార్యాలయాల ముందు బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. తమకు పట్టాలివ్వాలని పట్టా మార్పిడి చేయాలని తదితర అంశాలపై ఆందోళనలు చేస్తున్న  ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్