చిరు, పవన్ కన్నా నాకే క్రేజ్ ఎక్కువ.. రఘురామ సెటైర్లు..!

By telugu news teamFirst Published Jul 20, 2021, 7:41 AM IST
Highlights

ఇప్పటి వరకు మీడియాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అత్యధిక పారితోషికం ఇస్తున్నట్లు విన్నాం కానీ.. వారి కంటే నాకే ఎక్కువ ప్రజాధారణ ఉన్నట్లు.. అందుకే నాకు ఇంత మొత్తం ఇచ్చినట్లు కనిపిస్తోందంటూ రఘురామ సెటైర్లు వేశాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి  రఘురామ కృష్ణం రాజు కుట్ర పన్నారని.... ఆయన ఓ మీడియా సంస్థ నుంచి తాను మిలియన్ యూరోలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. డబ్బుల బదిలీల అలవాటు ఉన్నవారు యూరోల్లో బదిలీ చేశారేమో.. అందుకే ఆ పదప్రయోగాన్ని ఇక్క వాడినట్లు ఉందని పేర్కొన్నారు,

ఇప్పటి వరకు మీడియాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అత్యధిక పారితోషికం ఇస్తున్నట్లు విన్నాం కానీ.. వారి కంటే నాకే ఎక్కువ ప్రజాధారణ ఉన్నట్లు.. అందుకే నాకు ఇంత మొత్తం ఇచ్చినట్లు కనిపిస్తోందంటూ రఘురామ సెటైర్లు వేశాడు.

ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తనపై అఫిడవిట్ వేసిందని ఆయన అన్నారు. అందులో తనకు ఒక మిలియన్ యూరోలు అందినట్లు పేర్కొందని.. వారి డబ్బులు యూరోల్లో బదిలీ అయ్యాయేమో తనకు తెలీదన్నారు. సాధారణంగా మీడియాలో చాలా మంది అడిగే వార్తలు వేయించుకుంటున్నారని.. కానీ నాకే ఎదురు డబ్బు ఇచ్చి తనన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది.

అంతేకాకుండా.. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పుకారు సృష్టించారని.. తాను రాజీనామా చేయడం లేదని.. తన సభ్యత్వం రద్దు  చేయలేరని ఆయన అన్నారు. తాను షెడ్యూల్ 10లోని నిబంధనలను ఏనాడు ఉల్లంఘించలేదని.. వాళ్లు మోపిన అభియోగాలన్నీ అర్థం లేనివేనని ఆయన అన్నారు.

తన అనర్హత పై విజయసాయిరెడ్డి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. మరో వైపు విజయసాయి రెడ్డి... జనసేనలో గెలిచిన రాపాకకు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఎలా కలుపుకున్నారని ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలను తన పక్కన పెట్టుకొని.. సొంత పార్టీ నేతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.
 

click me!