అడవిలో మహిళ మృతదేహం.. చంపేసి, గుట్టు చప్పుడు కాకుండా పూడ్చేసీ..

By SumaBala BukkaFirst Published Nov 3, 2022, 1:09 PM IST
Highlights

మహిళను హత్య చేసి.. గుట్టు చప్పుడు కాకుండా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడో వ్యక్తి. ఆ మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. 

అన్నమయ్య జిల్లా :  అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం మద్ది నాయనిపల్లి అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. హత్య చేసి పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చనిపోయిన మహిళ ఉప్పరోళ్లపల్లికి చెందిన హేమవతిగా గుర్తించారు. ఆమె వయస్సు 45 ఏళ్లు ఉంటుందని నిర్ధారించారు. కాగా హేమవతి అన్నమయ్య జిల్లాలోని తన స్వగ్రామం నుంచి కర్ణాటక లోని చిక్బలాపూర్ జిల్లా తాటకంవారి హాళ్లిలో నివాసం ఉంటుంది. ఆమె బి.కొత్తకోటలో నివాసమున్న తన కూతురు భవాని ఇంటికి వచ్చింది.  ఈ క్రమంలోనే ఆమె హత్యకు గురైంది. 

హేమావతిని హత్య చేసి ములకలచెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో శవాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు ఆర్థిక సంబంధాల కారణంగానే  హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాగా, కుమార్తె ఇంటికి వెళ్లిన హేమలత పనిమీద ఇంటినుంచి బయటకు వెళ్లింది. ఆ తరువాత ఎంతకీ తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో నాలుగు రోజులు ఎదురు చూసిన తర్వాత ఇంటి నుంచి తిరిగి ఊరికి వెళ్లిన హేమవతి కనిపించడం లేదంటూ ఆమె కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

విశాఖపట్టణంలో నలుగురు విద్యార్ధులు అదృశ్యం:పోలీసులకు పేరేంట్స్ ఫిర్యాదు

కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. హేమలత బీ.కొత్తకోటలో నివాసం ఉంటున్న తన కూతురు ఇంటికి తరచూ వస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతుండడంతో స్నేహం పెరిగింది. వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హేమలత చనిపోవడంతో ఆమె హత్యకు శ్రీకాంత్ కారణం అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  శ్రీకాంత్ ఇచ్చిన సమాచారంతో హేమవతి డెడ్బాడీని పూడ్చిపెట్టిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు.

కాగా,  శ్రీకాంత్ దగ్గర తన తల్లి చాలా కాలంగా డబ్బు దాచుకునేదని మృతురాలి కుమారుడు చెప్పాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకే తన తల్లిని శ్రీకాంత్ హత్య చేశాడని ఆరోపించాడు. డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి ఫోన్ చేసి, పిలిపించిన శ్రీకాంత్.. హత్య చేశాడని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్ళాడు.  హేమావతి  మిస్సింగ్ పై  కర్ణాటకలోనూ ఫిర్యాదు చేశారు.

click me!