హోటల్‌లో గది బుక్ చేసి రమ్మన్నాడు, ఆ తర్వాత ముఖం చాటేశాడు: ప్రియుడిపై యువతి ఫిర్యాదు

By narsimha lodeFirst Published Oct 13, 2020, 10:17 AM IST
Highlights

 సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడు ప్రేమిస్తున్నాని చెప్పి యువతిని మోసం చేశారు. ఈ విషయమై బాధితురాలు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది.  ఈ విషయమై బాధితురాలిని మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశించారు.


గుంటూరు: సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడు ప్రేమిస్తున్నాని చెప్పి యువతిని మోసం చేశారు. ఈ విషయమై బాధితురాలు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది.  ఈ విషయమై బాధితురాలిని మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశించారు.

గుంటూరుకు చెందిన యువతి బీటెక్ చదివింది. విజయవాడలోని హాస్టల్ లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమౌతోంది.కృష్ణా జిల్లా  తిరువూరుకు చెందిన మోహన్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. వీరిద్దరూ తరచూ చాటింగ్ చేసుకొనేవారు. 

గుజరాత్ రాష్ట్రంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా  అతడు ఆమెను నమ్మించాడు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకొంటానని ఆమెను నమ్మబలికాడు.ఆమెతో సన్నిహితంగా మెలిగాడు.

హోటల్ లో గదిని బుక్ చేసి ఆమెను అక్కడికి రావాలని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆమె రాకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరింపులకు దిగాడు. తన ఆత్మహత్యకు ఆమె కారణమని బెదిరించాడు.

అంతేకాదు తన వద్ద ఉన్న ఆమె ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఈ వేధింపులు భరించలేక ఆమె హోటల్ గదికి వెళ్లింది. ఆ  తర్వాత పెళ్లి విసయమై ప్రశ్నిస్తే అతను మాట మార్చాడు. 

ఈ విషయమై బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి పిర్యాదు మేరకు ఆరోపణలను ఎదుర్కొంటున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
 

click me!