జగన్ కు షోకాజ్ నోటీసులు... సుప్రీంకోర్టుకు ఏపీ సీఎం వ్యవహారం

By Arun Kumar PFirst Published Oct 13, 2020, 8:13 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని న్యాయవాది సునీల్‌ కుమార్ సింగ్ పిటిషన్‌‌ దాఖలు చేశారు.

న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఓ న్యాయవాది. న్యాయవ్యవస్థను తప్పుబడుతూ న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ నిలువరించలేకపోతున్నారని... ఇందుకుగాను ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది సునీల్‌ కుమార్ సింగ్ పిటిషన్‌‌ దాఖలు చేశారు.

న్యాయస్థానాలను కించపర్చేలా వ్యవహరించినందుకు ఏపీ సీఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా పిటిషనర్ సుప్రీంను కోరారు. న్యాయమూర్తులను భయాందోళనకు గురిచేసేలా జగన్, ఆయన పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ చర్యల వల్ల న్యాయస్థానాలపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం వుందన్నారు. కాబట్టి న్యాయవ్యవస్థను కాపాడాలని...భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని సునీల్‌ కుమార్ సింగ్ కోరారు. 

ఇక ఏపీ ప్రభుత్వ ప్రతినిధి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కు చేసిన ఫిర్యాదు... ఆ తర్వాత ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను ప్రెస్ మీట్ లో వెల్లడించడాన్ని కూడా పిటిషనర్  తప్పుబట్టారు. కాబట్టి ప్రభుత్వ ప్రతినిధిపై కూడా కేసు నమోదు చేయాలని పిటిషనర్ సుప్రీంను కోరారు. భవిష్యత్తులో న్యాయవ్యవస్థకు సంబంధించి ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించకుండా చూడాలని... ఈ చర్యలకు కారణమైన సీఎం జగన్ పై  ఎందుకు చర్య తీసుకోకూడదో వెల్లడించేలా షోకాజ్ నోటీస్ ఇవ్వాలని సుప్రీం కోర్టును పిటిషనర్  కోరారు. 

click me!