భర్తతో గొడవ.. బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య..!

Published : Aug 16, 2021, 08:17 AM IST
భర్తతో గొడవ.. బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య..!

సారాంశం

శ్రావణ్ కుమార్ సెంట్రింగ్ సామాగ్రి అద్దెకిస్తూ.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల మానస తల్లిదండ్రులు తిరుపతి వెళ్తూ అల్లుడు, కుమార్తెను రావాలని కోరారు.

భర్త మీద కోపంతో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. భర్తతో తరచూ గొడవలు ఆమె మనసుకు తీవ్ర గాయం చేశాయి. దీంతో.. తట్టుకోలేక.. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. దానికన్నా ముందు.. తన ఇద్దరు చిన్నారుల ఉసురు కూడా తీసేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పిడుగురాళ్లకు చెందిన బండడారు శ్రావణ్ కుమార్కు.. విజయవాడకు చెందిన మానసతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి షర్మిల(3), జ్యోతిర్మయి(2) అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. శ్రావణ్ కుమార్ సెంట్రింగ్ సామాగ్రి అద్దెకిస్తూ.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల మానస తల్లిదండ్రులు తిరుపతి వెళ్తూ అల్లుడు, కుమార్తెను రావాలని కోరారు.

ఈ విషయాన్ని మానస రెండు రోజుల క్రితం భర్తకు చెప్పింది. తాను రానని.. పిల్లలను తీసుకొని నువ్వు వెళ్లాలని అతను భార్యకు చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. శనివారం మద్యాహ్నం కూడా ఇద్దరి విషయంలో మరోసారి గొడవైంది. దీంతో మనస్తాపానికి గురైన మానస.. పిల్లల గొంతు పిసికి చంపేసింది. అనంతరం.. ఆమె కూడా ఫ్యాన్ కి ఉరివేసుకుంది.

ఉదయాన్నే.. భార్య, పిల్లలు చనిపోయి ఉండటాన్ని గమనించిన శ్రావణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu