మద్యానికి బానిసగా మారి.. భార్య, కూతురి ఒంటికి నిప్పు పెట్టి..

Published : Aug 16, 2021, 07:40 AM ISTUpdated : Aug 16, 2021, 08:05 AM IST
మద్యానికి బానిసగా మారి.. భార్య, కూతురి  ఒంటికి నిప్పు పెట్టి..

సారాంశం

మద్యానికి బానిసగా మారిన శ్రీనివాస రెడ్డి భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ శనివారం మద్యానికి డబ్బులు ఇవ్వాలని సుశీలతో గొడవపడ్డాడు

అప్పటి వరకు వారి జీవితం సాఫీగానే సాగింది. కానీ.. మద్యం మహమ్మారి వారి జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. మద్యానికి బానిసగా మారి మృగంలా మారిపోయాడు. ఆ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో...  కట్టుకున్న భార్య, కన్న కూతురిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మాచవరం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి.. అదే గ్రామానికి చెందిన సుశీలతో సుమారు 30ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఇద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ప్రియాంక అనే 27ఏళ్ల వయసు ఉన్న మానసిక వైకల్యంతో బాధపడుతున్న కుమార్తె ఉంది.

మద్యానికి బానిసగా మారిన శ్రీనివాస రెడ్డి భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ శనివారం మద్యానికి డబ్బులు ఇవ్వాలని సుశీలతో గొడవపడ్డాడు. ఆమె ఇవ్వను అనడంతో.. కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్యను బెదిరించాడు. ఉరివేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. అయితే.. చుట్టుపక్కల వారు వారించడంతో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత.. అందరూ నిద్రపోతున్న క్రమంలో... భార్య, కుమార్తె ఒంటిపై నిప్పు పోసి అంటించాడు. 

వారి కేకలతో స్థానికులు వచ్చి.. వారిని ఆస్పత్రికి తరలించారు. దాదాపు 75శాతం కాలిపోయిన వారు.. ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: కాకినాడ లో డిప్యూటీ సీఎం పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Spech: మీ భూమి మీ హక్కు రాజ ముద్రతో పట్టా ఇస్తా | Asianet News Telugu