మూడు రాజధానులపై మాట్లాడని వైఎస్ జగన్: కారణం ఏమిటి?

By telugu teamFirst Published Aug 16, 2021, 7:44 AM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన చేయకపోవడం అశ్చర్యానికి గురి చేస్తోంది. దసరానాటికి సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖకు మారుతుందనే ప్రచారం జరుగుతోంది. జగన్ దానిపై మాట్లాడలేదు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మూడు రాజధానులపై ప్రస్తావించలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచించింది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. అటువంటి తన ప్రసంగంలో దాని గురించి ప్రస్తావించకపోవడానికి కారణం ఏమిటనేది తెలియడం లేదు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగాల్లో మూడు రాజధానుల గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే, జగన్ ఆదివారంనాటి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మాట మాత్రంగా కూడా దాని గురించి ప్రస్తావించలేదు. తన 26 నెలల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మాత్రమే వివింరాచరు. ప్రభుత్వోద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 

దసరా పర్వదినానికి విశాఖపట్నం నుంచి వైఎస్ జగన్ పనిచేయడం ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. దాంతో మూడు రాజధానుల గురించి జగన్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తారని అనుకున్నారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉందని, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ది జరుగుతుందని గవర్నర్ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలోనే కాకుండా శాసనసభ ప్రసంగంలోనూ చెప్పారు. 

మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై హైకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. లోకాయుక్త కార్యాలయాన్ని, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనే తన నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం ఆ ఆదేశాలు ఇచ్చింది. అయితే, ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని విశాఖఫట్నానికి తరలించడానికి న్యాయపరమైన చిక్కులు ఏవీ ఉండవు. ముఖ్యమంత్రి తనకు ఇష్టమైన చోటు నుంచి పనిచేయడానికి వీలుంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వెళ్లకుండా తన అధికార నివాసం నుంచే పనిచేస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో జగన్ మూడు రాజధానులపై మాట్లాడకపోవడంతో అయోయమం చోటు చేసుకుంది. 

click me!