చిన్ననాటి ప్రేమికుడితో మళ్లీ చిగురించిన ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని...

Published : Jul 19, 2021, 08:07 AM IST
చిన్ననాటి ప్రేమికుడితో మళ్లీ చిగురించిన ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని...

సారాంశం

వీరిద్దరూ గతంలో ప్రేమించుకోగా.. వీరి ప్రేమ పెళ్లిదాకా వెళ్లలేదు. రమ్యతోపాటు.. ఆమె ప్రియుడు షేక్ బాషా కి కూడా పెళ్లి జరిగింది. అయినా.. వీరిద్దరూ తాము పెళ్లి చేసుకున్నవారిని కాదని అక్రమ సంబంధం పెట్టుకున్నారు. 

ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. భర్త ప్రేమగా చూసుకుంటున్నాడు. అలాంటి సమయంలో ఆమెకు చిన్ననాటి ప్రేమికుడు మళ్లీ తారసపడ్డాడు. దీంతో.. పాత ప్రేమ మళ్లీ చిగురించింది. తన ప్రేమికుడితోనే జీవితం గడపాలని ఆశపడింది. ఈ క్రమంలో..  ఆమెకు భర్త అడ్డుగా అనిపించాడు. దీంతో.. ప్రియుడితో కలిసి.. భర్తను చంపించింది. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నంలోని మధురవాడకు చెందిన రమ్యకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోనె సతీష్ తో 2015 లో పెళ్లయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ దుబాయి వెళ్లిపోయారు. 2017లో వీరికి కుమార్తె పుట్టింది. 2019లో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన ఆమెకు.. పాత ప్రేమికుడు షేక్ బాషా కనిపించాడు.

వీరిద్దరూ గతంలో ప్రేమించుకోగా.. వీరి ప్రేమ పెళ్లిదాకా వెళ్లలేదు. రమ్యతోపాటు.. ఆమె ప్రియుడు షేక్ బాషా కి కూడా పెళ్లి జరిగింది. అయినా.. వీరిద్దరూ తాము పెళ్లి చేసుకున్నవారిని కాదని అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. నెల క్రితం దుబాయి నుంచి సతీష్ తిరిగివచ్చాడు.

భర్త రావడంతో.. ప్రియుడితో కలిసి గడపడానికి ఆమెకు కుదరడం లేదు. దీంతో.. ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలో పథకం ప్రకారం.. ఈ నెల 13న రాత్రి 8గంటలకు  సతీష్ తలపై బాషా ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. దీంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియదన్నట్లు.. ఎవరో కొట్టి చంపారని క్రియేట్ చేసింది. అయితే.. పోలీసులకు అనుమానం కలగడంతో.... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా.. అసలు నేరస్థులు బయటపడ్డారు. నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu