మైనర్ బాలికపై అత్యాచారం.. ఆమె సోదరి మెడలో తాళి కట్టి..

Published : Jul 19, 2021, 07:33 AM ISTUpdated : Jul 19, 2021, 07:41 AM IST
మైనర్ బాలికపై అత్యాచారం.. ఆమె సోదరి మెడలో తాళి కట్టి..

సారాంశం

ఆ తర్వాత అతని కన్ను ఆమె అక్క పై పడింది. బాలిక సోదరికి ప్రేమ పేరుతో దగ్గరై.. రహస్యంగా ఆమెను పెళ్లాడాడు. 

మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమె పై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దానంతటినీ వీడియో తీసి.. ఎవరికీ చెప్పదని బెదిరించాడు. అనంతరం.. అదే వీడియో  చూపించి బాలికను బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె దగ్గర నుంచి డబ్బు, బంగారం కాజేశాడు. ఆ తర్వాత అతని కన్ను ఆమె అక్క పై పడింది. బాలిక సోదరికి ప్రేమ పేరుతో దగ్గరై.. రహస్యంగా ఆమెను పెళ్లాడాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చేబ్రోలు మండాలనికి చెందిన వేములపల్లి జోషిబాబు ఇంజినీరింగ్ చదవి పొన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చిలకలూరిపేటకు చెందిన మైనర్ బాలిక 2019లో వేసవి సెలవులకు చేబ్రోలులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.

ఆ సమయంలో జోషిబాబు ఆమె వెంటపడ్డాడు. ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించి నెంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత.. అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బలవంతంగా నగ్నం గా వీడియో కాల్స్ చేయాలని బెదిరించేవాడు. వాటిని కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి.. బంగారు నగలను కాజేశాడు.

ఈ క్రమంలో.. బాలిక అక్కపై జోషిబాబు కన్నుపడింది. మాయమాటలు చెప్పి.. ప్రేమ పేరిట దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన రహస్య వివాహం చేసుకున్నాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu